అట్లీతో ఆయన భార్య ప్రియా మోహన్ తో హీరోయిన్ కీర్తి సురేష్ మంచి స్నేహాన్ని మైంటైన్ చేస్తుంది. రీసెంట్ గా జవాన్ రిలీజ్ సందర్భంగా ట్వీట్ చేసిన కీర్తి సురేష్ తాజాగా అట్లీ వైఫ్ తో కలిసి జవాన్ చలెయా సాంగ్ కి డాన్స్ కుమ్మేసింది. అట్లీ హిందీలోకి షారుఖ్ మూవీ తో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమా జవాన్ తోనే బ్లాక్ బస్టర్ అనిపించుకుని కోట్లు కొల్లగొట్టేస్తున్నాడు. సౌత్ మూవీస్ మిక్స్ చేసి సినిమా చేసాడు అని విమర్శించినా నార్త్ ఆడియన్స్ కి జవాన్ పిచ్చ పిచ్చగా నచ్చేసింది.
దానితో జవాన్ 600 కోట్ల కలెక్షన్స్ ని వారం తిరక్కుండానే కొల్లగొట్టడంతో అట్లీ పేరు మాగిపోతుంది ఇక జవాన్ సక్సెస్ ని అట్లీ భార్య ప్రియా మోహన్ ఇంకా హీరోయిన్ కీర్తి సురేష్ లు డాన్స్ చేస్తూ సెలెబ్రేట్ చేసుకున్న వీడియోని అట్లీ వైఫ్ ప్రియా మోహన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కీర్తి సురేష్-ప్రియా మోహన్ లు ఇద్దరూ డాన్స్ ఇరగదీసారు. అదే వీడియోలో అట్లీ కుక్కపిల్లతో ఆడుకుంటూ కనిపించాడు. ఆ వీడియో వైరల్ అవడంతో కీర్తి సురేష్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.