దేవర షూటింగ్ లో బాగా బిజీగా గడుపుతున్న ఎన్టీఆర్ షూటింగ్ నుంచి చిన్న బ్రేక్ దొరికినా ఫ్యామిలితో విదేశాలకి వెళ్ళిపోతున్నాడు. మే చివరి వారంలో కుటుంబంతో ఓ వారం ట్రిప్ వేసిన ఎన్టీఆర్ మొన్న మధ్యన ఓ ట్రైనింగ్ కోసం సింగిల్ గానే దుబాయ్ వెళ్ళాడు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ తన ఫ్యామిలీ అంటే భార్య లక్ష్మి ప్రణతి, పిల్లలు భార్గవ్, అభయ్ లతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించాడు. ఓకె దేవర షూటింగ్ నుంచి చిన్నపాటి విరామం దొరికింది ట్రిప్ వెళ్ళాడు అది బాగానే ఉంది.
కానీ నందమూరి, నారా ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉంది. నారా చంద్రబాబు నాయుడు అంటే ఎన్టీఆర్ మేనత్తమొగుడు రాజమండ్రి జైల్లో ఉన్నాడు. భువనేశ్వరి ఫ్యామిలీ, బాలయ్య అంతా అక్కడ ఏపీలో ఉన్నారు. ఈరోజు బాలకృష్ణ, లోకేష్, భువనేశ్వరి, జనసేన అధ్యక్షుడు పవన్ అంతా చంద్రబాబుతో ములాఖత్ అవుతున్నారు. అసలు చంద్రబాబు అరెస్ట్ అయ్యాక ఎన్టీఆర్ కానీ, కళ్యాణ్ రామ్ కానీ స్పందించలేదు. సోషల్ మీడియాలో ఓ ట్వీట్ ఇయ్యలేదు అనేది నందమూరి అభిమానుల వాదన.
ఇప్పుడు ఇలా ఫ్యామిలీ అందులోను బాబాయ్, మావయ్య కష్టాల్లో ఉన్నప్పుడు ఫ్యామిలీని పట్టించుకోకుండా ట్రిప్ కి వెళ్లడం ఎంతవరకు కరెక్ట్ అంటూ నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ పై కినుకు వహిస్తున్నారు. బాబు అరెస్ట్ పై సోషల్ మీడియాలో స్పందించలేదు, ఫ్యామిలీకి సపోర్ట్ చెయ్యడం లేదు.. అంటూ వారు రకరకాలుగా మాట్లాడుతున్నారు.
అయితే ఎన్టీఆర్ ఫ్యామిలీతో వెకేషన్ కి కాదు.. సైమా అవార్డ్స్ కోసం దుబాయ్ వెళుతున్నాడు... ఆ ఫంక్షన్ లో పాల్గొని.. భార్య పిల్లల్తో నాలుగురోజులు దుబాయిలోనే గడపడానికి ఎన్టీఆర్ ఫ్యామిలీని తీసుకువెళ్లాడని ఎన్టీఆర్ ఫాన్స్ చెబుతున్నారు.