సలార్ ని అఫీషియల్ గా పోస్ట్ పోన్ చేసినట్లుగా మేకర్స్ నిన్న బుధవారమే ప్రకటన ఇచ్చారు. అసలు సలార్ ఎందుకు వాయిదా వేశారు అనేది క్లారిటీ ఇవ్వకపోయినా.. సీజీ వర్క్ కంప్లీట్ అవ్వకపోవడం వలనే సలార్ ని వాయిదా వేశారని చెప్పుకుంటున్నారు. వాయిదా వేసిన విషయాన్ని చెప్పిక మేకర్స్.. కొత్త డేట్ లాక్ చెయ్యలేదు. కమింగ్ సూన్ అంటూ వదిలేసారు.
అయితే తాజాగా సలార్ డిసెంబర్ లో విడుదలయ్యే ఛాన్స్ ఉంది అంటూ తెలుగు నుండి హిందీ వరకు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే సలార్ సీజ్ వర్క్ కంప్లీట్ అయ్యి ఆ రష్ చూసాకే.. అది బావుంటేనే.. అప్పుడు సలార్ కి సంబంధించిన కొత్త రిలీజ్ డేట్ ఇవ్వాలని మేకర్స్ అనుకుంటున్నారట.
మరి సలార్ కొత్త డేట్ కోసం అభినులు తెగ వెయిట్ చేస్తున్నారు. అసలైతే మరో రెండు వారాల్లోనే సలార్ జాతర మొదలైపోయేది. కానీ ఇప్పుడది లేదు. ప్రభాస్ కూడా ప్రస్తుతం సలార్ విడుదల పోస్ట్ పోన్ అవడంతో ఆయన 15 రోజులపాటు విదేశాలకి వెళ్లిపోయారు.