అక్టోబర్ 19న గ్రాండ్ రిలీజ్ అంటూ ఎప్పుడో విడుదల తేదీ ప్రకటించిన భగవంత్ కేసరి ఇప్పుడు అనుకున్న తేదికి విడుదల కావడం అసాధ్యమయ్యేలా కనిపిస్తుంది. అనిల్ రావిపూడి నిన్నమొన్నటి వరకు షూటింగ్ ని చకచకా పరుగులు పెట్టించినా.. ఇప్పుడు మాత్రం కొద్దిపాటి షూటింగ్ బ్యాలెన్స్ ఉండిపోయింది. అది కూడా మరో వారంలో పూర్తయ్యేదే కానీ.. హీరో బాలకృష్ణ అందుబాటులో లేరు.
ప్రస్తుతం చంద్రబాబు అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైలులో ఉండడంతో బాలయ్య హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లి నాలుగైదు రోజులైంది. అక్కడే విజయవాడలో ఫ్యామిలీకి, టీడీపీ కార్యకర్తలకి, నేతలకి అందుబాటులో ఉంటున్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ తో కలిసి రాజమండ్రి వెళుతున్నారు. చంద్రబాబు తో ములాఖత్ అవ్వబోతున్నారు. అయితే ఈరోజే అనిల్ రావిపూడి ఇంకా భగవంత్ కేసరి నిర్మాతలు బాలయ్యని కలవబోతున్నారు.
నాలుగైదురోజులపాటు బాలయ్య తో లింక్ అయ్యి ఉన్న సీన్స్ ఉండడంతో ఆ డేట్స్ కోసం బాలయ్య నుంచి క్లారిటీ తీసుకునేందుకు అనిల్ అండ్ కో బాలయ్య దగ్గరకి వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ బాలయ్య చంద్రబాబు జైలు నుంచి బయటికి వచ్చేవరకు అందుబాటులో లేకపోతే.. భగవంత్ కేసరి సినిమా అక్టోబర్ 19 నుంచి పక్కకి జరిగే ఛాన్స్ లేకపోలేదు అంటూ ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.