Advertisementt

రికార్డ్ రేటుకి సలార్ శాటిలైట్ హక్కులు

Wed 13th Sep 2023 06:58 PM
salaar  రికార్డ్ రేటుకి సలార్ శాటిలైట్ హక్కులు
Salaar OTT Rights Bagged By Netflix రికార్డ్ రేటుకి సలార్ శాటిలైట్ హక్కులు
Advertisement
Ads by CJ

సలార్ నుంచి వచ్చింది ఒక్క టీజర్, కొన్ని పోస్టర్స్ మాత్రమే. ఇంకా సలార్ కి సంబంధించి ఒక్క పాట కానీ, ట్రైలర్ కానీ విడుదల కాకుండానే సినిమాపై ప్యాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన క్రేజ్, అంచనాలు ఉన్నాయి. ఈ నెల 28 న సలార్ వస్తుంది.. బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు రికార్డులని కొల్లగొడుతూ గత రికార్డులని తుడిచేస్తుంది అనుకుంటే.. అది కాస్తా వాయిదా పడింది. 

అయితే సలార్ విడుదలకి సంబంధించి కొత్త డేట్ రాకపోయినా.. ఇప్పుడు సలార్ శాటిలైట్ హక్కుల పరంగా కొత్త నెంబర్లు నోట్ చేసింది. స్టార్ టీవీ రికార్డ్ ప్రైస్ తో సలార్ ప్యాన్ ఇండియాకి సంబంధించిన ఐదు భాషల శాటిలైట్ హక్కులని దక్కించుకుంది. ఇంకా డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ ఓటిటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. 

ఈమధ్యన భారీ బడ్జెట్ మూవీస్ ని నెట్ ఫ్లిక్స్ వారే భారీ డీల్ తో కొనుక్కుపోతున్నారు. ఇక సలార్ కూడా నెట్ ఫ్లిక్ చేతుల్లోకి వెళ్లబోతుంది అంటూ స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. ఇక సలార్ మూవీ ఈ ఏడాది డిసెంబర్లో విడుదలయ్యే ఛాన్స్ వుంది.. త్వరలోనే ఆ రిలీజ్ డేట్ కూడా మేకర్స్ లాక్ చేసి ప్రకటిస్తారని అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. 

Salaar OTT Rights Bagged By Netflix:

Salaar OTT rights sold for a fancy sum

Tags:   SALAAR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ