Advertisementt

రీ షూట్ మోడ్ లో టిల్లు స్క్వేర్

Wed 13th Sep 2023 05:20 PM
dj tillu square  రీ షూట్ మోడ్ లో టిల్లు స్క్వేర్
Tillu Square in re shoot mode రీ షూట్ మోడ్ లో టిల్లు స్క్వేర్
Advertisement
Ads by CJ

డీజే టిల్లు తో అదిరిపోయే హిట్ కొట్టిన కుర్రహీరో సిద్దు జొన్నలగడ్డ యూత్ లో క్రేజీ హీరోగా మారాడు. డీజే టిల్లుకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ ని రెడీ చేస్తున్నాడు. టిల్లు స్క్వేర్ ని ఎప్పుడో ఆగస్టు లోనే విడుదల చెయ్యాలనుకుంటే.. దానికి ఇప్పటివరకు రిలీజ్ డేట్ లాక్ చెయ్యకుండా మేకర్స్ ఇంకా ఇంకా ఆలోచనలోనే ఉన్నారు. సిద్దు జొన్నలగడ్డకి జోడిగా ఈసారి అనుపమ నటించబోతుంది. గెస్ట్ రోల్ లో నేహా శెట్టి ని చూడబోతున్నామని అంటున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ సినిమాపై మరిన్ని అంచనాలు క్రియేట్ చేసింది. 

డీజే టిల్లు కి మించిన బ్లాక్ బస్టర్ ఇవ్వాలని టిల్లు స్క్వేర్ కోసం సిద్దు బాగా కష్టపడుతున్నాడట. షూటింగ్ పూర్తయ్యి ఓ పక్క పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నా ఇంకా బెటర్ మెంట్ కోసం కొన్ని సన్నివేశాలని రీ ఘాట్స్ చేస్తూ తగ్గేదే లే అంటున్నాడట. ఫైనల్ గా  ఫస్ట్ కాపీ రెడీ అయ్యాకే టిల్లు స్క్వేర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తారని సమాచారం. ప్రస్తుతం అయితే సిద్దు రీ షూట్ మోడ్ లో ఉన్నాడని.. ఏ నిమిషమైనా ఈ చిత్రానికి విడుదల తేదీ ప్రకటించే ఛాన్స్ ఉందట. 

Tillu Square in re shoot mode:

Surprising developments in DJ Tillu Square

Tags:   DJ TILLU SQUARE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ