టాలీవుడ్ ని ఊపేస్తూ మిగతా హీరోయిన్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ.. యంగ్ హీరోలు, స్టార్ హీరోలు ఇలా ప్రతి ఒక్క టాలీవుడ్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న శ్రీలీల వచ్చే ఆరు నెలల్లో ఆరు సినిమాలతో అభిమానులని సర్ ప్రైజ్ చెయ్యడానికి రెడీ అయ్యింది. వరస సినిమాలు, అందులోను యంగ్ హీరోల సినిమాలతో శ్రీలీల ఊపుమీదుంది.
అయితే పెళ్లి సందD మూవీ అప్పుడు శ్రీలీల చాలా తక్కువ పారితోషకానికి పని చేసింది. ఆ తర్వాత ధమాకా కి కూడా శ్రీలీల పారితోషకం లక్షల్లోనే ఉంది. ఆ సినిమా హిట్ తో శ్రీలీల పారితోషకం బాగా పెరిగిపోయింది. ఇప్పుడు శ్రీలీల పారితోషకం కోట్లలోకి వెళ్ళింది. ప్రస్తుతం సినిమాలే కాదు.. అటు షాప్ ఓపెనింగ్స్ అంటూ రిబ్బన్స్ కటింగ్ లోను రికార్డులు క్రియేట్ చేస్తుంది.
షాప్ ఓపెనింగ్స్ కి వెళితే శ్రీలీల కి కోటి ముట్టజెబుతున్నట్లుగా టాక్ ఉంది. మరి హీరోయిన్స్ షాప్ ఓపెనింగ్స్ కి వెళితే మహా ఉంటే పది నిముషాలు ఉంటారు, రిబ్బన్ కటింగ్, జ్యోతి ప్రజ్వలన ... రెండు మూడు చీరలు మీదేసుకుని ఫొటోలకి ఫోజులిస్తారు. ఇదంతా కేవలం పది నిముషాలు స్పెండ్ చేస్తే సరిపోతుంది. మరి ఆ పది నిమిషాలకి కోటి అంటే నిమిషానికి 10 లక్షలు అన్నమాట. ఈ లెక్కన శ్రీలీల పారితోషకం లెక్క చూస్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.