ఫైనల్లీ హోంబేలె ఫిలిమ్స్ వారు సలార్ పోస్ట్ పోన్ అయిన విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రేక్షకులకి, అభిమానులకి సినిమా విడుదల ఆలస్యమవుతున్నందుకు చింతిస్తున్నట్టుగా ప్రకటన విడుదల చేసారు. అయితే ఈ పోస్ట్ పోన్ ప్రకటనతో పాటుగా సలార్ కొత్త డేట్ లాక్ చేసి ఆ కొత్త తేదీని కూడా వదులుతారని అనుకున్నారు. కానీ నిర్మాతలు సలార్ కమింగ్ సూన్ అంటూ చెప్పి తప్పించుకున్నారు.
అదేదో కొత్త డేట్ కూడా వదిలితే ఈ పోస్ట్ పోన్ మేటర్ పై ప్రభాస్ అభిమానులు కూల్ అయ్యేవారు. కానీ కొత్త తేదీ ఇవ్వలేదు అనగానే అసలు సలార్ ఈఏడాది విడుదలవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ ఏంటి వెయిటింగ్ అంటూ.. అభిమానులు కూడా అడుగుతున్నారు. నిజమే ఇప్పుడు విడుదల ఆపేసినా.. ఆ కొత్త డేట్ ఇచ్చేస్తే బావుండేది. మరి మేకర్స్ ఇంకా ఎందుకు అంతగా ఆలోచిస్తున్నారో కదా!.