హీరోయిన్ గా స్టార్ స్టేటస్ అందుకోలేక కష్టపడిన తెలుగమ్మాయి బిందు మాధవి అడుగుపెట్టిన ప్రతి భాష లోను ఆమెకి చుక్కెదురైంది. నటనకు భారీగా గ్యాప్ ఇచ్చిన బిందు మాధవి తెలుగు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడమే కాదు.. ఆడపులి అనిపించుకుని టైటిల్ పట్టుకుపోయింది. ఆ తర్వాత హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇస్తుంది అనుకుంటే.. ఆమెకి తగిన అవకాశాలు రాలేదు.
అందుకే సోషల్ మీడియా వేదికగా గ్లామర్ షో కి తెర లేపింది. గ్లామర్ అవుట్ ఫిట్స్ తో మత్తెక్కిస్తోంది. ఇక బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక న్యూసెన్స్ వెబ్ సీరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సీరీస్ విజయం సాధించడంతో బిందు మాధవి ఆ సీరిస్ పార్ట్2 లో నటిస్తుంది. ఆ తర్వాత మరో సీరీస్ లో కనిపించినా అది ఆకట్టుకోలేదు.
తాజాగా ఓ పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. Fashionably late for this post🙈 అంటూ.. పోస్ట్ లేట్ అయ్యింది అని చెప్పుకొచ్చింది. రెడ్ మోడరన్ అవుట్ ఫిట్ లో గ్లామర్ గా కనిపించి.. వెనుదిరిగి ఉన్న ఆ ఫోజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి ఇప్పటికైనా ఈ తెలుగందం బిందు మాధవి కెరీర్ లో బిజీగా మారుతుందేమో చూద్దాం.