KGF 2 విడుదలై ఈ మార్చ్ కి ఏడాదిపూర్తయ్యింది. కేజీఫ్ 2 విడుదల కాగానే దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో ప్యాన్ ఇండియా ఫిలిం సలార్ మొదలు పెట్టేసాడు. కానీ హీరో యష్ ఇంతవరకు కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టలేదు. ఎట్టకేలకి యష్ తన తదుపరి ప్రాజెక్ట్ కి ప్లాన్ చేసుకున్నట్లుగా టాక్. KGF తర్వాత దానికి సీక్వెల్ KGF 3 మొదలు పెట్టేవరకు యష్ సెట్స్ మీదకి వెళ్లడనే అనుకున్నారు. మధ్యలో నర్తన్ తో సినిమా సెట్ అయ్యింది, కాదు లేడీ డైరెక్టర్ తో యష్ కొత్త సినిమా మొదలు పెట్టబోతున్నాడంటూ రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
అయితే ఇప్పుడు తాజాగా యష్ నేషనల్ అవార్డు విన్నింగ్ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ డ్రామా కి శ్రీకారం చుట్టాడు. డిసెంబర్ మూడో వారంలో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నట్టుగా సమాచారం. అయితే ఈ చిత్ర కథ మొత్తం గోవాలో జరిగే డ్రగ్ మాఫియా రాకెట్ చుట్టూ నడుస్తుందని తెలుస్తోంది.
ఇప్పటికే యష్ దీనిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాడని, కొన్ని నెలల క్రితం గోవా పరిసర ప్రాంతానికి వెళ్లి అక్కడి పరిసరాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడంతో పాటు గన్ షూటింగ్ తదితర వాటిలో ప్రత్యేక శిక్షణ పొందడంతో ఈ చిత్రంపై ఇప్పుడు భారీ అంచనాలు మొదలు కాగా.. యష్ అభిమానులు మాత్రం రెండేళ్ల వెయిట్ చేయించినా మంచి సబ్జెక్టు తో వస్తున్న యష్ ని చూసి హ్యాపీగా ఫీలవుతున్నారట.