మరో రెండు వారాల్లో ప్రభాస్ ఫాన్స్ సలార్ విడుదలతో పండగ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటే సలార్ నిర్మాతలు మాత్రం ప్రభాస్ ఫాన్స్ ఆశలపై నీళ్లు చల్లారు. వారు డిస్పాయింట్ అయ్యేలా చేసారు. ఇప్పటివరకు సలార్ నిర్మాతలు ఆ సినిమా పోస్ట్ పోన్ విషయం చెప్పలేదు. ఇక అది పోస్ట్ పోన్ అంటూ వార్తలు రావడంతో ఆ డేట్ ని చాలామంది హీరోలు ఆక్యుపై చేసారు. అయితే సెప్టెంబర్ 28 న సలార్ రావడం లేదు. కొత్త డేట్ ఎప్పుడు ఇస్తారు అనేది కూడా అయోమయంగానే ఉంది.
సలార్ కొత్త డేట్ నవంబర్ లో అని ఒకరు, కాదు డిసెంబర్ లో అని ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఈ కొత్త డేట్ కూడా త్వరలోనే ప్రకటిస్తారు అనుకుంటే అది కూడా ఇప్పుడప్పుడే లేదు అంటున్నారు. అయితే సలార్ డిసెంబర్ పై కన్ను వేసింది అని తెలియగానే హిందీలో ప్లాన్ చేసిన రెండు సినిమాలు జనవరికి వెళితే ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తున్నారట.
మరి సలార్ ని పోస్ట్ పోన్ చేస్తున్నట్టుగా ప్రకటించి ఆ కొత్త డేట్ ఏదో రివీల్ చేస్తే అభిమానులు కాస్త కూల్ అవుతారు. లేదంటే వారు ఇంకా డిస్పాయింట్ మోడ్ నే మైంటైన్ చేస్తారు. మరి ఈ నెల చివరి నుండి డిసెంబర్ వరకు ప్రభాస్ ఫాన్స్ కి సలార్ రాక కోసం వెయిటింగ్ తప్పేలా కనిపించడం లేదు.