Advertisementt

ట్రెండ్ అవుతున్న రైతు బిడ్డ

Tue 12th Sep 2023 03:42 PM
pallavi prashanth  ట్రెండ్ అవుతున్న రైతు బిడ్డ
Pallavi Prashanth trends on twitter ట్రెండ్ అవుతున్న రైతు బిడ్డ
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 7 లోకి రైతు బిడ్డగా అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ కేవలం రైతు మాత్రమే కాదు.. అతను యూట్యూబర్ కూడా. అలా ఫేమస్ అయ్యే అతను బిగ్ బాస్ లోకి అడుగుపెట్టాడు. అక్కడికి వెళ్ళాక అతను సింపతీ కొట్టేసేందుకు అడుగడుగునా ట్రై చేస్తున్నాడు. అందులో భాగంగానే నేను రైతు బిడ్డని ఫుడ్ విలువ నాకు తెలుసు అంటూ.. కెమెరాలతో మాట్లాడుతున్నాడు. ఇక హౌస్ లో ఒకలా.. నామినేషన్స్ లో మరోలా బిహేవ్ చెయ్యడం మిగతా హౌస్ మేట్స్ కి నచ్చలేదు. 

గత రాత్రి అంటే సోమవారం రాత్రి నామినేషన్స్ లో పల్లవి ప్రశాంత్ ని చాలామంది ఇంటి సభ్యులు టార్గెట్ చేసారు. అందులో ఓ నామినేషన్స్ లో నీకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కి లక్ష వస్తుంది అనగానే అవునా నాకు నిజంగా లక్ష వస్తే మరో నిరుపేద రైతుకి ఇస్తా అంటూ సింపతీ కొట్టేసే ప్లాన్ చేసాడు. కానీ అమరదీప్ వదల్లేదు కేవలం రైతులు మాత్రమే కష్టపడుతున్నారా.. బిటెక్ చదివి ఉద్యోగం లేక చాలామంది సఫర్ అవుతున్నారు. లక్ష తీసుకుని పేద రైతుకి ఇస్తా అంటున్నావ్.. ఆటోవాడు లేడా, మిగతా వారు లేరా అంటూ అమరదీప్ రెచ్చిపోయి పల్లవి ప్రశాంత్ గాలి తీసేసాడు. 

మరికొంతమంది కూడా హౌస్ లో సైలెంట్ గా ఉంటున్నావు, కెమెరాలతో మట్లాడుతన్నావు, కానీ ఇక్కడ నామినేషన్స్ లో యాటిట్యూడ్ చూపిస్తున్నావు అంటూ పల్లవి ప్రశాంత్ ని ఆడుకుంటున్నారు. నిజంగానే పుష్పరాజ్ అనుకున్నాడో ఏమో.. పల్లవి ప్రశాంత్ నామినేషన్స్ విషయంలో చాలా డిఫ్రెంట్ గా బిహేవ్ చేసాడు. నెటిజెన్స్ అయితే పల్లవి ప్రశాంత్ సింపతీ కోసమే ఏడుస్తూ యాక్షన్ చేస్తున్నావ్ అంటూ దిమ్మతిరిగేలా ట్రోల్ చేస్తున్నారు. మరోపక్క అమరదీప్ కరెక్ట్ గా మాట్లాడాడా లేదా పల్లవి ప్రశాంత్ కరెక్ట్ గా ఉన్నాడా.. అంటూ సోషల్ మీడియాలో #PallaviPrashanth హాష్ టాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. 

Pallavi Prashanth trends on twitter:

Pallavi Prashanth Creates A New Record

Tags:   PALLAVI PRASHANTH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ