కోలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో లోకేష్ కనగరాజ్ ఒకరు. ఖైదీ, మాస్టర్, విక్రమ్ చిత్రాలతో టాప్ లిస్ట్ లో చేరిన లోకేష్ కనగరాజ్ ఇప్పుడు స్టార్ హీరో విజయ్ తో మరోసారి లియో మూవీ చేస్తున్నాడు. ఆ చిత్రం విడుదల కాక ముందే లోకేష్ మరో ప్రాజెక్ట్ ప్రకటించాడు. సన్ పిక్చర్స్ నిర్మాణంలో సూపర్ స్టార్ రజినీకాంత్ తో మూవీ చేస్తున్నట్లుగా ప్రకటించారు. దానితో సూపర్ స్టార్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.
కానీ కార్తీ అభిమానులు, కమల్ అభిమానులు మాత్రం అదేమిటి లోకేష్.. మరి ఖైదీ సీక్వెల్, విక్రమ్ సీక్వెల్స్ ఏమి చేస్తావు, అవి ఎప్పుడు చేస్తావు అని అడుగుతున్నారు. ఖైదీ మూవీకి సీక్వెల్ కోసం తమిళ ప్రేక్షకులే కాదు.. తెలుగు ప్రేక్షకులు వెయిటింగ్, అసలు ఖైదీగా కార్తీ ఎందుకు జైలులో ఉన్నాడో అతని ఫ్లాష్ బ్యాక్ స్టోరీ తెలియాల్సి ఉంది. ఇక విక్రమ్ సీక్వెల్ కోసం ప్యాన్ ఇండియా పేక్షకులు వెయిటింగ్.
విక్రమ్ లోకి సూర్య ని దించాడు. రోలెక్స్ గా సూర్య విక్రమ్ సీక్వెల్ ఖచ్చితంగా ఉండాలి, ఖైదీ కి-విక్రమ్ కి లింక్ చేసాడు. LCU అంటూ లోకేష్ కకానగరాజ్ యూనివర్సల్ సృష్టించాడు. ఇప్పుడు ఇది వదిలేసి రజినీకాంత్ తో మూవీ అంటున్నాడు. మరి అది ఏం చేస్తావ్ లోకేష్.. ఒకవేళ రజినీకాంత్ మూవీని కూడా LCU లోకి దించుతావా అంటూ నెటిజెన్స్ కూడా లోకేష్ ని అడుగుతున్నారు.