తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు అంశం ఏపీని కుదిపేస్తోంది. ఎక్కడికక్కడ రవాణ నిలిచిపోయింది. అరెస్ట్‌పై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీకి చెందిన కీలక నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేసినా కూడా ఆందోళనలు మాత్రం ఆగడం లేదు. పార్టీకి చెందిన క్యాడర్ అంతా రోడ్లపైకి స్వచ్ఛందంగా వచ్చి ఆందోళనలకు పూనుకుంది. ఈ క్రమంలోనే వైసీపీ నేతలపై పెద్ద ఎత్తున కార్యకర్తలు మండిపడుతున్నారు. కావాలని చంద్రబాబును ఇలా ఇరికించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఆధారాలు కూడా లేకుండా ఇలా చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.
ఇక టీడీపీ పరిస్థితి ఇలా ఉంటే.. వైసీపీ పరిస్థితి మరోలా ఉంది. మొత్తానికి వైసీపీ వర్గాలు అంతర్మథనంలో పడినట్టు టాక్ నడుస్తోంది. చంద్రబాబు అరెస్టు ఏదో సింపుల్ వ్యవహారమని భావించిన వైసీపీకి ఊహించని షాక్ తగలింది. చంద్రబాబు అరెస్ట్ ఈ స్థాయిలో చర్చ అవుతుందని అనుకోలేదంటూ వైసీపీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని తెలుస్తోంది. ప్రాంతీయ మీడియానే కాదు.. జాతీయ మీడియా సైతం జీ 20ని పక్కనబెట్టి మరీ చంద్రబాబు అరెస్టుపై ఇచ్చిన కవరేజ్‌తో ప్రభుత్వంలో అంతర్మథనం ప్రారంభమైందని సమాచారం. చంద్రబాబు అరెస్టు తాము అనుకున్న అవినీతి కోణంలో వెళ్లలేదని మంత్రులు చర్చించుకుంటున్నారని సమాచారం.
చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం మొత్తం కక్షతో చేయించనట్టుగానే జనాల్లోకి వెళ్లిందని వైసీపీ నేతలు ఓ అంచనాకు వచ్చారని తెలుస్తోంది. చంద్రబాబును ఒక్క రోజు అయినా జైల్లో పెట్టాలి అనే జగన్ లక్ష్యం మేరకు అరెస్టు జరిగిందని జనంలో బీభత్సంగా చర్చ జరుగుతోందని వైసీపీ విశ్లేషిస్తోంది. దాని నుంచి బయట పడేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, నేతలతో పదుల సంఖ్యలో వైసీపీ మీడియా సమావేశాలు నిర్వహిస్తోంది కానీ ఫలితం శూన్యం. చంద్రబాబు విచారణ వీడియోలు, విచారణ సమయంలో కేవలం సాక్షి ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్‌కు మాత్రమే సీఐడీ కార్యాలయంలోకి అనుమతి ఉండటం వంటి ఫోటోలు బయటకు రావడంతో చంద్రబాబుకు మరింత సింపతీ వచ్చిందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తం చంద్రబాబు అరెస్ట్ ఎపిసోడ్‌లో లాభం కంటే నష్టం ఎక్కువగా ఉందని వైసీపీ నేతలు కలత చెందుతున్నారని సమాచారం.