అనుష్క పబ్లిక్ లోకి రాదా.. రానట్టే. కొంతమంది నెటిజెన్స్ అదే మాట్లాడుకుంటున్నారు. నిశ్శబ్దం సినిమా అప్పుడు ప్రమోషన్స్ లేకుండా కరోనా అడ్డం పడిపోయిది. అక్కడ అనుష్క పబ్లిక్ లోకి రావాల్సిన అవరసం లేదు. ఇక మిస్ శెట్టి తో అయినా పబ్లిక్ లోకి వస్తుంది అనుకుంటే అప్పుడు కూడా ఆమె మీడియా ముందుకు రాలేదు. సుమతో వీడియో ఇంటర్వ్యూ అన్నారు. టీవీ ఛానల్ ఇంటర్వ్యూ అన్నారు. అది ఇప్పటివరకు ప్లే అవ్వలేదు.
నవీన్ పోలిశెట్టి సింగిల్ గా ప్రమోషన్స్ చేసాడు.. ఇప్పటికీ అమెరికాలో చేస్తూనే ఉన్నాడు. సినిమా హిట్ అయ్యింది. అనుష్క వీడియో ఇంటర్వ్యూ బయటికి రాలేదు. ఎప్పుడు వస్తుందో తెలియదు. రాదని అంటున్నారు. సినిమా విడుదలకు ముందు ఫోన్ ఇంటర్వూస్ తో మేనేజ్ చేసింది. వెబ్ మీడియా కి ఫోన్ ఇంటర్వ్యూలతో సరిపెట్టేసింది.
ఛానల్స్ కి ఓ వీడియో ఇంటర్వ్యూ చేసారు. అది సుమతో అని నవీన్ చెప్పాడు. సినిమా విడుదల ముందు అది రిలీజ్ చేస్తామని అన్నారు. అది ఇప్పటికైనా ప్లే అవుతుంది అని చాలామంది ఎదురు చూసారు. కానీ అవ్వలేదు. హిట్ అయ్యాక అయినా సక్సెస్ సెలెబ్రేషన్స్ కి రాదు. అలాంటపుడు సినిమాలు చెయ్యడం ఎందుకు, పబ్లిక్ లోకి రాకుండా ఇలా ఎన్నాళ్ళు అనుష్క మేనేజ్ చేస్తుందో అనేది ఎవరికీ అర్ధం కావడం లేదు.