ఎవ్వరికి భయపడని అనసూయ ఇప్పుడు ట్రోల్స్ కి భయపడుతున్నట్టుగా కనిపిస్తుంది. సోషల్ మీడియా అయినా, ఓపెన్ గా అయినా ఎలాంటి బెదురూ లేకుండా మాట్లాడే అనసూయ ఇప్పుడు మాట్లాడానికి భయపడుతుందట. అదే విషయాన్ని పెదకాపు 1 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో బయటపెట్టింది. ఈమధ్యన అనసూయ విజయ్ దేవరకొండ ఫాన్స్ కి భయపడినట్లుగా.. అతనితో గొడవకుఫుల్ స్టాప్ పెడుతున్నట్టుగా విమానం ఈవెంట్ లో చెప్పుకొచ్చింది.
రౌడీ ఫాన్స్ నోటికొచ్చిన్నట్లుగా తిడుతూ ట్రోల్ చెయ్యడం ఆమెని మనశ్శాంతి కి దూరం చేసింది. తాను కూడా ఈ గొడవకి ఫుల్ స్టాప్ పెడుతున్నది మనశ్శాంతి కోసమే అని చెప్పింది. ఇప్పుడు కూడా ఏం మాట్లాడితే ఏమవుతుందో, ఏది రాస్తారో అని చెప్పడం చూస్తే అనసూయ ట్రోలర్స్ కి భయపడడమే కాదు.. ఈ విషయంలో గట్టిగానే హార్ట్ అయ్యింది అనిపిస్తుంది.
ఇక నిన్న బట్టల షాప్ ఓపెనింగ్ కి వచ్చిన ఆమె సారీలో బ్యూటిఫుల్ గా కనిపించింది.. ఈ రోజు పెదకాపు1 ప్రెస్ మీట్ లో క్యాజువల్ వేర్ లో కనిపించింది. అయితే అనసూయ ఈ రెండు అవుట్ ఫిట్స్ లోను కాస్త బరువుగా కనిపించింది. కానీ ఆ ఫేస్ లో స్మైల్ ఏమాత్రం తగ్గలేదు. అంతే అందమైన చిరునవ్వుతో సోషల్ మీడియాలో కనిపించింది.