Advertisementt

పుష్ప 2 రిలీజ్ డేట్ వచ్చేసింది

Mon 11th Sep 2023 05:08 PM
pushpa 2  పుష్ప 2 రిలీజ్ డేట్ వచ్చేసింది
Pushpa2 all set to rule cinemas from 15th August, 2024! పుష్ప 2 రిలీజ్ డేట్ వచ్చేసింది
Advertisement
Ads by CJ

ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న అల్లు ఫాన్స్ కి పుష్ప మేకర్స్ ఫైనల్ గా గుడ్ న్యూస్ చెప్పారు. పుష్ప ద రూల్ రిలీజ్ డేట్ కోసం అల్లు ఫాన్స్ పెద్ద యుద్ధమే చేసారు. అయినా కూడా తాపీగా మేకర్స్ ఇప్పటికి పుష్ప 2 రిలీజ్ డేట్ విషయాన్ని తేల్చారు. 

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప ది రైజ్.. ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. 2021 బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది పుష్ప. అల్లు అర్జున్ కెరీర్ లోనే అతిపెద్ద విజయంగా నిలవడంతోపాటు.. తనకు జాతీయస్థాయి అవార్డు తెచ్చి పెట్టిన చిత్రంగా పుష్ప నిలిచింది. 

పుష్ప 1కి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న పుష్ప ద రూల్ చిత్రం పై భారీ అంచనాలు పెరిగాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు చిత్ర యూనిట్ గుడ్ న్యూస్ అందించింది. సోమవారం పుష్ప 2 విడుదల తేదీని ప్రకటించారు. 2024 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన వేర్ ఇస్ పుష్ప వీడియో సినిమాపై అంచనాలు పెంచింది.

Pushpa2 all set to rule cinemas from 15th August, 2024!:

Pushpa2 – The Rule, all set to rule cinemas from 15th August, 2024!

Tags:   PUSHPA 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ