జాన్వీ కపూర్ కి ఆమె తండ్రి బోని కపూర్ ఓ కండిషన్ పెట్టారంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది ఓ స్టార్ హీరోతో జాన్వీ నటించకూడదు అని ఆమె నుండి బోని కపూర్ మాట తీసుకున్నారనే న్యూస్ సిల్లీ కాక మరేమవుతుంది. బాలీవుడ్లో స్టార్ స్టేటస్ కోసం ట్రై చేస్తున్న జాన్వీ కపూర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది. అసలు ఎన్టీఆర్ తో దేవర మూవీ ఫిక్స్ అవ్వకముందు జాన్వీ కపూర్ తమిళ్ నుండి సౌత్ ఎంట్రీ ఉంటుంది అని ప్రచారం జరిగింది.
అది కూడా అజిత్ తో జాన్వీ కపూర్ తమిళ సినిమా సిద్ధం కాబోతుంది అన్నారు. తర్వాత బోని కపూర్ అది రూమర్ అని తేల్చేసారు. ఇప్పుడు బోని కపూర్ తన కూతురు జాన్వీ కపూర్ ని ధనుష్ తో కలిసి నటించకూడదు అనే మాట తీసుకున్నాడంటున్నారు, అజిత్ తో కానీ, సూర్య కాని, విజయ్ సినిమాలో కానీ జాన్వీ కపూర్ తమిళ ఎంట్రీ ఇచ్చేలా ఆయన చూస్తున్నాడట.
మరి ధనుష్ తో జాన్వీ కపూర్ ని నటించవద్దు అని ఆయన మాట తీసుకోవడం అనేది సిల్లీ రూమర్ కాక మరేమవుతుంది. ధనుష్ కోలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు దూసుకుపోతున్న హీరో. అలాంటి హీరో సరసన జాన్వీని నటించకూడదు అని బోని మాత్రం ఎందుకనుకుంటారు, ఇదేదో గాలి వార్తే అయ్యుంటుంది అని ధనుష్ అభిమానులు మాట్లాడుతున్నారు.