వయసు పైబడిన కొద్దీ మనిషి కృంగిపోతాడు..! కానీ 73 ఏళ్ల వయసులోనూ చంద్రబాబులోని స్థిర చిత్తం చూసి అధికార పక్షానికే ఒకింత అసూయ కలిగి ఉంటుంది..! ఏదో ఆయనను ఇబ్బంది పెట్టాలని చాలా రోజుల క్రితం స్కెచ్ గీసి.. ఏపీ సీఎం జగన్ తాను లండన్ నుంచి తిరిగి వచ్చేసరికి పూర్తయ్యేలా ప్లాన్ చేశారు. శుక్రవారం నుంచే వైసీపీ ప్రభుత్వం సీఐడీని రంగంలోకి దింపింది. అప్పటికే చంద్రబాబు అరెస్ట్ వార్తలు బయటకు వచ్చేశాయి. శుక్రవారమంతా సీఐడీ చేస్తున్న హడావుడితో ఆయనకు నిద్ర లేదు. ఇక శనివారం తెల్లవారుజామున ఆయనను అరెస్ట్ చేసి రోడ్డు మార్గంలో తీసుకెళ్లారు. మొత్తంగా 320 కిలోమీటర్ల ప్రయాణం.
నిద్రాహారాలు లేక..!
శనివారం అంతా కూడా బీభత్సమైన హడావుడి నిద్ర దరిచేరే సమయం లేదు. పైగా అనుక్షణం టెన్షన్. వేరొకరు చంద్రబాబు ప్లేస్‌లో ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ ఆయన ఎక్కడా చలించలేదు. శుక్రవారం నంద్యాలలో ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ’ కార్యక్రమానికి హాజరయ్యారు. అదే రోజు రాత్రి 10 నుంచి పోలీసుల హడావుడి ప్రారంభమైంది. ఎట్టకేలకు శనివారం ఉదయం అరెస్ట్ చేశారు. ఆ తరువాత జరిగిన పరిణామాలన్నీ తెలిసినవే. చంద్రబాబును విజయవాడ తీసుకొచ్చాక ఆయనను వైద్యులు 45 నిమిషాల పాటు వివిధ పరీక్షలు నిర్వహించి.. ఆయన ఆరోగ్యం పర్ఫెక్ట్ అని తేల్చారు. అంతేకాదు.. వైద్యులు, సిబ్బంది ఆయనతో సెల్ఫీలు తీసుకున్నారు. ఎక్కడా కూడా అరెస్ట్ విషయమై చంద్రబాబులో ఆందోళన కనిపించలేదు.
ఇవన్నీ కామన్!
ఆయనకు కాసేపు వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినా కూడా ఐయామ్ ఫర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అనేశారు. అంతేకాదు.. కోర్టులోనూ తొలుత తన వాదనలు కాన్ఫిడెంట్‌గా వినిపించారు. ఆ తర్వాత చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ సిద్ధార్థ లూద్రా రంగంలోకి దిగారు. ఆ సమయంలో కూడా కోర్టు చంద్రబాబును.. మీరు వేరే రూంకి వెళ్లి రెస్ట్ తీసుకుంటారా? అని ప్రశ్నించినా కూడా తాను అక్కడే ఉంటానని బదులిచ్చారు. అంతేకాదు.. రాజకీయాల్లో ఇలాంటి వన్నీ కామన్ అంటూ ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులను చంద్రబాబు ఓదార్చారు. కోర్టు తీర్పును వెలువరించిన అనంతరం కూడా చంద్రబాబు నిబ్బరంగానే కనిపించారు. ఎక్కడా కూడా కొంచెం ఆందోళన కూడా ఆయనలో కనిపించలేదు. పైగా తనకు 14 రోజుల రిమాండ్ అని తెలిసి ఆవేదన చెందుతున్న కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఎంతటి కష్టం వచ్చినా కృంగిపోవద్దని చంద్రబాబు చెప్పకనే చెప్పారు.
కొద్దిరోజులు అంతే!
చూశారుగా బాబు అధికారంలో ఉన్నప్పుడు 24 గంటలు అభివృద్ధి.. సమాజం.. ప్రజలు ఆలోచిస్తూ ఉంటారని తెలుగు తమ్ముళ్లు చెబుతుంటారు కదా.. ఇప్పుడు జరుగుతున్న, జరగబోయే పరిణామాలు..చూశాక నిజంగా చంద్రబాబు మనిషి కాదు మర మనిషి.. మిషన్ అని అనక తప్పదేమో..! మున్ముందు ఇంకా ఎన్నేన్ని జరుగుతాయో.. బాబుపై ఇంకెన్ని కేసులు మోపి పైశాచిక ఆనందం పొందుతారో.. చంద్రబాబు టైం వచ్చాక జగన్ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది వేచి చూడాలి మరి.. అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది.. కాకపోతే కాస్త ఓపికతో ఉండాలి అంతే!