Advertisementt

రెహ్మాన్ లైవ్ కాన్సెర్ట్-అసంతృప్తిలో ఫాన్స్

Mon 11th Sep 2023 11:08 AM
ar rahman  రెహ్మాన్ లైవ్ కాన్సెర్ట్-అసంతృప్తిలో ఫాన్స్
AR Rahman Chennai concert earns flak for poor management రెహ్మాన్ లైవ్ కాన్సెర్ట్-అసంతృప్తిలో ఫాన్స్
Advertisement
Ads by CJ

ఆదివారం సాయంత్రం చెన్నై లో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహ్మాన్ లైవ్ కాన్సెర్ట్ జరిగిన విషయం తెలిసిందే. రెహ్మాన్ మ్యూజిక్ కాన్సెర్ట్ అంటే అభిమానులు ఆగుతారా.. ఆధిక ధరలకు టికెట్స్ కొని మరీ రెహ్మాన్ మ్యూజిక్ కాన్సెర్ట్ లో వాలిపోతారు. నిన్న రాత్రి కూడా అదే జరిగింది. వేలాదిగా రెహ్మాన్ మ్యూజిక్ కాన్సెర్ట్ కోసం టికెట్స్ కొనుక్కుని ఆ ఈవెంట్ జరిగిన ప్రదేశానికి వచ్చేసారు కానీ అక్కడ ఈవెంట్ ఏర్పాట్లని చూసి అభిమానులు సైతం షాకయ్యారు. 

టికెట్ ని ఎక్కువ రేట్లకి కొనుగోలు చేసి ఆత్రంగా మ్యూజిక్ కాన్సెర్ట్ నిర్వహిస్తున్న చెన్నైలోని ఆదిత్యారామ్ ప్యాలెస్ కి వెళిపోతే.. అక్కడ కొంతమంది అభిమానులని లోపలికి ఎంటర్ అవ్వకుండా ఆపెయ్యడమేకాకుండా.. లోపలికి వెళ్లిన వాళ్ళకి సరిపడా కుర్చీలు కూడా లేకపోవడం, సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై అక్కడ ఈవెంట్ నిర్వాహకులపై అభిమానులకి ఆగ్రహం తెప్పించింది. 

ACTC వారు రెహ్మాన్ లైవ్ కాన్సెర్ట్ కి ఆర్గనైజర్లు గా వ్యవహరించారు. కానీ ఈవెంట్ ని ఆర్గనైజ్ చెయ్యడంలో ACTC వారు టోటల్ గా ఫెయిల్ అవడంతో మ్యూజిక్ లవర్స్ తమ అసంతృప్తిని వ్యకం చేస్తున్నారు. 

AR Rahman Chennai concert earns flak for poor management:

AR Rahman Chennai Concert Turns Nightmare, Angry Fans SLAM Organisers For Mismanagement

Tags:   AR RAHMAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ