ఎన్టీఆర్ పై పెరుగుతున్న ఒత్తిడి అనగానే.. ఈయనేదో దేవర షూటింగ్ విషయంలో, అలాగే అప్ డేట్స్ విషయంలో అభిమానులు ఎన్టీఆర్ పై ఒత్తిడి పెంచుతున్నారేమో అనుకునేరు.. కాదు కాదు.. గత రెండు రోజులుగా ఏపీలో జరుగుతున్న పొలిటికల్ హీట్ పై ఎన్టీఆర్ స్పందించకపోవడంపై టిడిపి కార్యకర్తలు, అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పై ఒత్తిడి పెంచుతున్నారు.
శనివారం తెల్లవారుఝామున అరెస్ట్ అయిన చంద్రబాబు నిన్న విచారణ తర్వాత విడుదలైపోతారు, బెయిల్ వస్తుంది అనుకుంటే మళ్ళీ సిబిఐ కోర్టు లో ఆయనకి 14 రోజులు రిమండ్ విధించడంతో ఏపీలో రాజకీయాలు వేడెక్కడం కాదు.. టీడీపీ నేతలు ధర్నాలు మొదలు పెట్టడం, ఈరోజు ఏపీ వ్యాప్తంగా బంద్ జరగడం ఇవన్నీ రాజకీయాలే అయినా.. ఎన్టీఆర్ కి సంబంధం లేకపోయినా.. చంద్రబాబు ఎన్టీఆర్ కి మేనత్తమొగుడు, మావయ్య అవుతాడు.
దాని గురించి అయినా ఎన్టీఆర్ మావయ్యకి సపోర్ట్ గా ఓ ట్వీట్ వేసినట్లయితే బావుండేది ఎన్టీఆర్ అభిమానులు, నందమూరి ఫాన్స్, టీడీపీ నేతలు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. కానీ చంద్రబాబు అరెస్ట్ అయ్యి రెండు రోజులు గడిచినా. మళ్ళీ రిమాండ్ అంటూ రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించినా ఎన్టీఆర్ ఏమి మాట్లడకపోవడంతో అభిమానులు ఏదైనా ట్వీట్ చెయమంటూ ఒత్తిడి చేస్తున్నారు. మరి ఈ విషయమై ఎన్టీఆర్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.