లావణ్య త్రిపాఠి అతి త్వరలోనే మెగా ఫ్యామిలీలోకి కోడలిగా అడుగుపెట్టబోతుంది. నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ ని లావణ్య వివాహమాడబోతుంది. మూడు నెలల క్రితమే వరుణ్ తేజ్ తో నిశ్చితార్ధం చేసుకుని అఫీషియల్ గా కోడలి స్థానాన్ని సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి అప్పటినుండి ఏ సినిమాలో నటించిన సందర్భం కానీ, ఏ సినిమాకి సైన్ చేసిన విషయం కానీ తెలియలేదు. అయితే లావణ్య త్రిపాఠి ఎక్కువగా జిమ్ లో కనిపిస్తుంది.
అందుకే ఆమె నటనకి స్వస్తి చెప్పదు.. సినిమాల్లో నటిస్తుంది,మెగా కోడలైతే ఏమిటి సినిమాల్లో నటించకూడదా అన్నారు. అంతేకాకుండా లావణ్య త్రిపాఠి నటనకు బై బై చెప్పేసి నిర్మాతగా మారుద్ది అన్నారు. ఈ విషయమై ఎలాంటి క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు లావణ్య త్రిపాఠి ఓ ఆఫర్ ని రిజెక్ట్ చేసింది అంటూ వస్తున్న వార్త చూస్తే నిజంగా లావణ్య త్రిపాఠి గ్రేట్ అనే చెప్పాలి. అంటే బోల్డ్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ ఉన్నాయని.. సైన్ చేసిన ప్రాజెక్ట్ ని లావణ్య వదులుకోవడం అనేది ఆలోచించాల్సిందే కాదు.. మెగా ఫాన్స్ ని సంతోషపెట్టే విషయం.
అది తమిళనాట లావణ్య త్రిపాఠికి ఓ వెబ్ సీరీస్ ఆఫర్ రాగా దానికి నచ్చి సైన్ చేసిన లావణ్య ఇప్పడు నిశ్చితార్ధం తర్వాత ఆ సీరిస్ లో హీరోయిన్ పాత్రకి రొమాంటిక్ సీన్స్ తో పాటుగా, బోల్డ్ సీన్స్ కూడా ఉండడంతో ఇప్పడు ఆ ప్రాజెక్ట్ ని లావణ్య వదులుకుంది అంటున్నారు. మరి మెగా కోడలిగా వెళితే ఇలాంటివి చేస్తే బావుండదు అనుకునే ఈ అవకాశం లావణ్య చేజార్చుకుంది అనుకుంటున్నారు.