Advertisementt

మూన్ మీద ఉన్నట్లుందట..

Mon 25th Sep 2023 12:08 PM
ms shetty mr polishetty,ravi teja,mahesh babu,naveen polishetty  మూన్ మీద ఉన్నట్లుందట..
Mahesh Babu and Ravi Teja Praises on Ms Shettyy Mr Polishetty మూన్ మీద ఉన్నట్లుందట..
Advertisement
Ads by CJ

నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఈ సినిమాకు ఆడియెన్స్‌తో పాటు సెలబ్రిటీల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమా ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, స్టార్ డైరెక్టర్స్ మారుతి, వంశీ పైడిపల్లి, స్టార్ హీరోయిన్ సమంత వంటి వారంతా సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపించగా.. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాస్ మహరాజ్ రవితేజ ఈ సినిమా అద్భుతంగా ఉందంటూ సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు.

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాను మా ఫ్యామిలీతో కలిసి ఆద్యంతం ఎంజాయ్ చేశాను. కంప్లీట్ ఎంటర్ టైనర్ ఇది. నవీన్ పోలిశెట్టి తన కామెడీ టైమింగ్‌తో అదరగొడితే.. అనుష్క ఎప్పటిలాగే బ్రిలియంట్‌గా నటించింది. ఈ సినిమాతో సక్సెస్ అందుకున్న దర్శకుడు పి.మహేశ్ బాబు, యూవీ క్రియేషన్స్, మిగతా టీమ్ మెంబర్స్ అందరికీ కంగ్రాట్స్.. అని సూపర్‌స్టార్ మహేష్ బాబు ట్వీట్‌లో పేర్కొనగా.. మీకు మా సినిమా నచ్చడం చాలా హ్యాపీగా ఉంది. మూన్ మీద ఉన్న ఫీలింగ్ కలుగుతోంది. ఈ సంతోషంలో మా టీమ్‌లో ఎవరం నిద్ర కూడా పోము. మీ గుంటూరు కారం సినిమా కోసం ఎదురుచూస్తున్నామని నవీన్ పోలిశెట్టి రిప్లయ్ ఇచ్చారు.

మాస్ రాజా రవితే తన ట్వీట్‌లో.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాను చూస్తూ బాగా ఎంజాయ్ చేశాను. నవీన్ పోలిశెట్టి మరోసారి అద్భుతమైన ఫర్ పార్మెన్స్‌తో అలరించాడు. అతని హ్యూమర్ టైమింగ్ అదిరిపోయింది. అనుష్క ఎప్పటిలాగే అలరించింది. ఈ సినిమా టీమ్ అందరికీ బిగ్ కంగ్రాట్స్ చెబుతున్నా.. అని పేర్కొనగా.. ‘థాంక్యూ సార్. మిమ్మల్ని గతంలో కలిసినప్పుడు మీరు ఇచ్చిన సూచనలు మర్చిపోలేను. ఎల్లప్పుడూ మీ నటన, ఎనర్జీతో మమ్మల్ని ఇన్‌స్పైర్ చేస్తున్నందుకు థ్యాంక్స్. మీకు మా సినిమా నచ్చడం ఎంతో సంతోషంగా ఉందని నవీన్ పోలిశెట్టి రిప్లయ్ ఇచ్చారు. ఇలా ఒక్కరేమిటి.. టాలీవుడ్‌లో సెలబ్రిటీలందరూ ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తుండటం విశేషం.

Mahesh Babu and Ravi Teja Praises on Ms Shettyy Mr Polishetty:

Naveen Polishetty Reaction on Mahesh and Ravi Teja Tweets on Ms Shetty Mr Polishetty

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ