ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప చిత్రం ఎటువంటి రికార్డులు క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ సినిమాలో చేసిన నటనకుగానూ ఫస్ట్ టైమ్ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్‌ను టాలీవుడ్ తరపు నుంచి అల్లు అర్జున్ అందుకున్నారు. ఇక పుష్ప సృష్టించిన సునామీతో రెండో పార్ట్ పుష్ప ది రూల్‌ను భారీ బడ్జెట్‌తో.. అసలెక్కడా కాంప్రమైజ్ కాకుండా మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై ఏదో రకంగా నిత్యం వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
రీసెంట్‌గా ఈ సినిమాలో ప్రియమణి నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అంతే ఇందులో ఆమెకి ఏ పాత్ర ఇస్తారా? అని అంతా ఆలోచనలో పడ్డారు. అయితే చిత్రయూనిట్ మాత్రం ఎక్కడా ఆమె నటిస్తున్నట్లుగా చెప్పలేదు. తాజాగా ప్రియమణి కూడా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. ఆ వార్తలు విని షాకయినట్లుగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం జవాన్ సక్సెస్‌లో హ్యాపీ మూడ్‌లో ఉన్న ప్రియమణి.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో ఆమెకు పుష్ప2కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె సమాధానమిస్తూ..
పుష్ప2లో నేను చేయడం లేదు. ఆ వార్తలు ఎవరు సృష్టించారో కూడా నాకు తెలియదు. ఆ వార్తలు చూసి నేను కూడా ఆశ్చర్యపోయాను. వెంటనే నా మేనేజర్‌కి కూడా కాల్ చేసి మాట్లాడాను. అతను కూడా ఇది రూమర్‌గా కొట్టిపాడేశాడు. నిజంగా అల్లు అర్జున్ సరసన ఛాన్స్ వస్తే మాత్రం తప్పకుండా చేస్తాను. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలైతే నిజం కాదు.. అని ప్రియమణి చెప్పుకొచ్చింది. ఆ మధ్య అల్లు అర్జున్ కూడా ‘ఢీ’ ఫినాలే గెస్ట్‌గా వచ్చినప్పుడు ప్రియమణితో ఛాన్స్ వస్తే ఖచ్చితంగా చేస్తానని తెలిపిన విషయం తెలిసిందే.