Advertisementt

కన్నప్పలో ప్రభాస్.. పెద్ద ప్లానే ఇది!

Sun 10th Sep 2023 06:57 PM
prabhas,manchu vishnu,kannappa,key role  కన్నప్పలో ప్రభాస్.. పెద్ద ప్లానే ఇది!
Prabhas Key Role in Manchu Vishnu Starring Kannappa కన్నప్పలో ప్రభాస్.. పెద్ద ప్లానే ఇది!
Advertisement
Ads by CJ

భక్త కన్నప్ప అనగానే గుర్తొచ్చే పేరు రెబల్ స్టార్ కృష్ణంరాజు. ఈ సినిమాని ప్రభాస్‌తో రీమేక్ చేయాలని దివంగత నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు కలలు కన్నారు. ఫ్యాన్స్ కూడా ఈ సినిమాని ప్రభాస్ చేస్తే బాగుంటుందని ఊహించారు. కానీ ఈ సినిమాపై ఎప్పటి నుంచో మంచు మోహన్ బాబు అండ్ ఫ్యామిలీ కన్నేసి ఉంచింది. వాళ్లు అనుకున్నట్లుగానే మంచు విష్ణు హీరోగా ఈ సినిమా రీసెంట్‌గా ప్రారంభమైంది కూడా. కన్నప్ప పేరుతో మంచు విష్ణు హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమా రీసెంట్‌గా శ్రీకాళహస్తిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్‌కి లోనయ్యారు. అయితే అలా డిజప్పాయింట్ అయిన వారందరికీ మంచు విష్ణు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. అదేంటంటే..

రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ ఇందులో ఓ కీ రోల్ చేయబోతున్నారు. ప్రభాస్.. కీ రోల్‌కు సంబంధించి మంచు విష్ణు కూడా కన్ఫర్మ్ చేశారు. ట్విట్టర్ వేదికగా వైరల్ అవుతున్న ఈ వార్తను మంచు విష్ణు.. హరహర మహాదేవ్ అంటూ కన్నప్ప హ్యాప్‌ట్యాగ్‌తో క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఒక్కసారిగా కన్నప్ప ట్యాగ్ ట్రెండ్‌లోకి వచ్చేసింది. ప్రభాస్ ఇందులో చేస్తున్నాడని తెలియగానే.. ఈ సినిమా స్వరూపమే మారిపోయింది. మంచు ఫ్యామిలీ హీరోలకు చాలా కాలం నుంచి సరైన సినిమా పడటం లేదు. ఇప్పుడు కన్నప్ప సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లకుండానే ప్రభాస్ పేరుతో.. పక్కా బ్లాక్‌బస్టర్ అనేలా టాక్ మొదలైంది. ఎందుకంటే.. కన్నప్పకి ఉన్న కనెక్షన్ అలాంటిది మరి. 

అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవెల్‌లో ఈ సినిమాను నిర్మించడానికి మంచు విష్ణు సన్నాహాలు చేస్తున్నారు. తన తండ్రి మోహన్ బాబు ఈ సినిమాను అవా ఎంటర్టైన్మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై నిర్మిస్తుండగా.. స్టార్ ప్లస్‌లో మహాభారత్ సిరీస్‌కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించనున్నారు. కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ విష్ణు సరసన హీరోయిన్‌గా నటించనుంది. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి మ్యూజిక్ అందించనున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విశేషాలను త్వరలోనే మంచు విష్ణు తెలియజేయనున్నారు.

Prabhas Key Role in Manchu Vishnu Starring Kannappa:

Manchu Vishnu Starring Kannappa Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ