Advertisementt

సమంతా.. ఖుషి సంగతేంటి?

Sun 10th Sep 2023 06:19 PM
samantha,miss shetty mr polishetty,kushi  సమంతా.. ఖుషి సంగతేంటి?
Samantha Raves About Miss Shetty Mr Polishetty సమంతా.. ఖుషి సంగతేంటి?
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి సినిమా విడుదలైన మూడు రోజుల పాటు భారీ కలెక్షన్స్‌ను రాబట్టింది. ఆ తర్వాత అనూహ్యంగా కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. పోనీ ఈ వీకెండ్ మళ్లీ సెట్ అవుతుందిలే అని అనుకోవడానికి లేకుండా.. జవాన్, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలు పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుని.. దృష్టంతా మరల్చాయి. దీంతో ఖుషి రికవరీ కాస్త కష్టంగానే మారింది. అయితే అమెరికాలో ఉన్న సమంత హడావుడిగా వచ్చేయడంతో.. ఖుషి సినిమాను లేపేందుకే అని అంతా అనుకున్నారు. కానీ ఖుషి వదిలేసి.. అనుష్క నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాని ప్రమోట్ చేసే పని పెట్టుకుంది సమంత.

తాజాగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా చూసిన సమంత.. సోషల్ మీడియా వేదికగా ఆ సినిమాపై పొగడ్తల వర్షం కురిపించింది. ఈ మధ్య కాలంలో ఏ సినిమా కూడా నన్ను ఇంతగా నవ్వించలేదని, నవీన్ అద్భుతంగా నటించాడంటూ కితాబిచ్చింది. అలాగే అనుష్క ఇందులో ఛార్మింగ్‌గా కనిపించిందని తెలుపుతూ.. యూనిట్‌కి అభినందనలు తెలిపింది. దీంతో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి యూనిట్ హ్యాపీగా ఉన్నా.. ఖుషి యూనిట్, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్.. ఇదేంటిది.. ఇది మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంటూ సోషల్ మీడియాలో వింత ముఖాలు పెడుతున్నారు.

అనుష్క సినిమా సంగతి అటుంచి.. ఖుషిని గట్టెక్కించే ప్రయత్నాలు చేయమని కొందరు సమంతకు సలహాలు కూడా ఇస్తున్నారు. ఇదిలా ఉంటే.. అనుష్క, నవీన్ పోలిశెట్టి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా సెలబ్రిటీల నుంచి అనూహ్య స్పందనను రాబట్టుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళి వంటి వారంతా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ప్రేక్షకులు కూడా ప్రస్తుతం ఈ సినిమాపై దృష్టి పెట్టడంతో కలెక్షన్స్ పెరుగుతున్నట్లుగానే తెలుస్తోంది. యుఎస్‌లో కూడా ఈ సినిమాకు మంచి స్పందనే వస్తోంది.

Samantha Raves About Miss Shetty Mr Polishetty:

Fans No Kushi with Samantha Response on MSMP 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ