Advertisementt

నిర్మాతకి అంతసీన్ లేదన్న హీరో తండ్రి

Sun 10th Sep 2023 02:26 PM
vijay deverakonda,father,abhishek nama,wfl  నిర్మాతకి అంతసీన్ లేదన్న హీరో తండ్రి
Vijay Deverakonda Father Serious on Producer Abhishek Nama నిర్మాతకి అంతసీన్ లేదన్న హీరో తండ్రి
Advertisement
Ads by CJ

 

విజయ్ దేవరకొండని టాలీవుడ్ నిర్మాత అభిషేక్ పిక్చర్స్ అధినేత బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ విజయ్ దేవరకొండ తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశాడు. కొంతకాలంగా విజయ్ దేవరకొండకి సక్సెస్‌ లేదు. తాజాగా ఖుషి మూవీ‌తో హిట్ కొట్టాను అంటూ సక్సెస్ మీట్ పెట్టి అభిమానులకి కోటి విరామం ప్రకటించగా.. టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా విజయ్ దేవరకొండ‌ని ట్యాగ్ చేస్తూ విజయ్ సినిమా వలన 8 కోట్లు నష్టపోయానని? అవి తిరిగిస్తారా అంటూ వెటకారంగా చేసిన ట్వీట్ టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. 

తాజాగా విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధన్ ఈ ఇష్యూపై స్పందిస్తూ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా పోయినప్పుడు తన పారితోషకంలో సగం ఇచ్చేశాడు. ఫ్లాట్ ఇస్తాను అన్నా తీసుకోలేదు. అయినా సినిమా పొతే నిర్మాతలకి సంబంధం ఉంటుంది కానీ... హీరోకి ఏమి సంబంధం. అసలు అభిషేక్ నామా ఎప్పటినుండో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. మేము అతనితో మాట్లాడుతున్న విషయం కూడా విజయ్‌కి తెలియదు. 

అలాంటిది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా విజయ్ పేరు ప్రస్తావించడం నాకు బాధగా ఉంది. నిజంగా మేము డబ్బులివ్వాల్సి ఉంటే కోర్టుకి వెళ్లి తేల్చుకోవాలి. అభిషేక్ నామా నా కొడుకుని బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నాడు. కానీ అతని పప్పులేమి ఉడకవు. ఒకసారి విజయ్‌కి మార్కెట్ లేదు అంటాడు. మరోసారి అతని డేట్స్ అడుగుతాడు. అతను మాట్లాడే మాటలకి పొంతన లేదు. ప్రస్తుతం విజయ్ వేరే నిర్మాతలతో సినిమాలు చేస్తున్నాడు. అభిషేక్ నామాతో విజయ్ సినిమా చేయడు అని విజయ్ తండ్రి తేల్చేశారు.

Vijay Deverakonda Father Serious on Producer Abhishek Nama:

Vijay Deverakonda Father Sensational Comments

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ