Advertisementt

శెట్టి గొడవ వినిపించడం లేదు

Sun 10th Sep 2023 12:20 PM
ms shetty mr polishetty,jawan,collections  శెట్టి గొడవ వినిపించడం లేదు
Jawan dominates Ms Shetty Mr Polishetty శెట్టి గొడవ వినిపించడం లేదు
Advertisement
Ads by CJ

ఎంతో కష్టపడి ఒంటరిగా సినిమాని ప్రమోట్ చేసుకుంటూ వచ్చాడు నవీన్ పోలిశెట్టి. సినిమా ఫినిష్ అయ్యి ప్రేక్షకుల ముందుకు రావడానికే నానా కష్టాలు పడినా.. మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి మూవీకి పబ్లిక్ నుండి మంచి టాకే వచ్చింది. సినిమా బావుంది అన్నారు. రివ్యూస్ పాజిటివ్‌గా వచ్చాయి. కానీ మొదటి రోజే కలెక్షన్స్ పరంగా సినిమాకి ఎదురు దెబ్బ తగిలింది. జవాన్ ప్రభంజనంలో మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి కొట్టుకుపోయింది. 

కొన్ని చోట్ల థియేటర్స్‌లో 30 శాతం ఆక్యుపెన్సీ లేదు. నవీన్ పోలిశెట్టి సినిమాని తెగ ప్రమోట్ చేశాడు. అనుష్క కదలకపోయినా నవీన్ వదల్లేదు. సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడంలో తనవంతు ప్రయత్నం చేశాడు. కానీ జవాన్ జాతరలో శెట్టి వినిపించకుండా పోయింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల బిసి సెంటర్స్‌లోను జవాన్ ప్రభంజనం కనిపిస్తుంది. మాస్ ఆడియన్స్ మొత్తం జవాన్ కే జై కొడుతున్నారు. 

మిస్ శెట్టి క్లాస్ మూవీ. సినిమా బావున్నా ఫ్యామిలీ ఆడియన్స్ తప్ప మిగతావారు ఈ సినిమా చూసేందుకు అంతగా ఇంట్రెస్ట్ చూపించరు. దానివలనే మిస్ శెట్టికి కలెక్షన్స్ పరంగా దెబ్బవుతోంది అని ట్రేడ్ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి. అయితే టాలీవుడ్‌కి చెందిన సెలబ్రిటీలు చాలా మంది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి గురించి పోస్ట్‌లు చేస్తుండటంతో.. సినిమాపై ప్రేక్షకులలోనూ కాస్త ఇంట్రెస్ట్ పెరుగుతోంది. ఈ ఇంట్రస్ట్‌ థియేటర్ల వరకు రప్పిస్తే.. మాత్రం శెట్టి సినిమా సెట్ అయినట్లే.

Jawan dominates Ms Shetty Mr Polishetty:

Ms Shetty Mr Polishetty Talk Ok but No Collections

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ