గత ఏడాది కాలంగా కోలీవుడ్ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ తరచూ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నారు. అందంగామైన నటి మహాలక్ష్మి రవీందర్ ని వివాహం చేసుకుని అందరికి బిగ్ షాకిచ్చింది. సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. వాళ్ళ పెళ్లి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మహాలక్ష్మి డబ్బు కోసమే అంత భారీకాయుడు రవీందర్ ని వివాహం చేసుకుంది అన్నారు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో రవీందర్-మహాలక్ష్మి విడిపోయారనే ప్రచారము జరిగింది. కానీ అదంతా జస్ట్ రూమర్ అని ఈ జంట తేల్చేసింది.
అయితే తాజాగా రవీందర్ చంద్రశేఖరన్ ని అరెస్ట్ చెయ్యడం కోలీవుడ్ లో కలకలం సృష్టించింది. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ రవీందర్ ని అరెస్ట్ చేసింది. అసలు రవీందర్ ని సిబిఐ ఎందుకు అరెస్ట్ చెయ్యాల్సి వచ్చింది అంటే.. రవీందర్ ఓ వ్యాపారవేత్తని మోసం చేసి.. అందులో భాగంగా అరెస్ట్ అయ్యారు. చెన్నై కి చెందిన బాలాజీ అనే వ్యాపారవేత్తతో కలిసి భాగస్వామిగా బిజినెస్ చేద్దామని 15 కోట్లు తీసుకుని మోసం చేసినట్లుగా అధికారులు నిర్ధారించారు.
బాలాజీ అనే వ్యాపారవేత్త నుండి రవీందర్ 15 కోట్లు 2020లోనే తీసుకున్నట్లుగా ఆధారాలు కూడా సిబిఐ సేకరించింది. అయితే ఒప్పందం ప్రకారం బాలాజీకి ఇచ్చిన వాగ్దానాలు రవీందర్ నెరవేర్చకపోగా.. అతని డబ్బు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో బాలాజీ రవీందర్ పై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ లో ఫిర్యాదు చెయ్యగా.. కీలక ఆధారాలతో సిబిఐ రవీందర్ ని అరెస్ట్ చేసింది.