నిన్న గురువారం ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైన జవాన్ మూవీకి పబ్లిక్ నుండి పాజిటివ్ రావడమే కాదు.. అడ్వాన్స్ బుకింగ్ తోనే మొదటి రోజు జవాన్ రికార్డ్ కలెక్షన్స్ కలెక్ట్ చేసింది. షారుఖ్ యాక్టింగ్, నయనతార పెరఫార్మెన్స్, దీపికా గెస్ట్ రోల్, యాక్షన్ సన్నివేశాలు, అనిరుద్ మ్యూజిక్, అట్లీ మేకింగ్ అన్ని జవాన్ మూవీ సక్సెస్ లో భాగమయ్యాయి. నార్త్ నుంచి సౌత్ వరకు జవాన్ మాయలో పడిపోతున్న ప్రేక్షకులు.. ఇప్పుడు జవాన్ సినిమాని ప్రదర్శించాలంటూ కొన్ని చోట్ల రోడ్డెక్కి ప్రదర్శనలు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
జవాన్ ని థియేటర్స్ లో విడుదల చెయ్యమని షారుఖ్ ఫాన్స్ ఆ దేశ ప్రభుత్వాన్ని కోరుతూ ధర్నాలు చేపట్టారు. అది ఎక్కడంటే బాంగ్లాదేశ్ లో. ఈ ఏడాది జనవరిలో విడుదలైన షారుఖ్ పఠాన్ కూడా బాంగ్లాదేశ్ లో విడుదల కాలేదు. ఇక ఇప్పుడు జవాన్ కూడా విడుదల కాలేదు. కారణం బాంగ్లాదేశ్ లో అంతర్యుద్ధ పరిస్థితులు నెలకొనడం, ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నిరసనలు చేపట్టడంతో అక్కడి ప్రభుత్వం చాలాచోట్ల కర్ఫ్యూ విధించింది.
దానితో బాంగ్లాదేశ్ సెన్సార్ బోర్డు సినిమా విడుదలపై నిషేదాజ్ఞలు జారీచేసింది. అందుకే సినీ ప్రేక్షకులు ముఖ్యంగా షారుఖ్ అభిమానులు జవాన్ ని వీక్షించేందుకు థియేటర్స్ లో జవాన్ ని విడుదల చెయ్యాలంటూ నిరసనలు చేస్తూ ధర్నాలు చేస్తూ రోడ్డెక్కారు.