కుర్ర హీరో నవీన్ పోలిశెట్టి ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు లాంటి సూపర్ హిట్ కామెడీ ఎంటెర్టైనర్స్ తో ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యాడు. అదే ఊపులో అనుష్క లాంటి క్రేజీ హీరోయిన్ తో మిస్ శెట్టి-మిస్టర్ పొలిశెట్టి మూవీ మొదలు పెట్టాడు. మధ్యలో ఏవేవో కారణాలతో సినిమా విడుదల బాగా లేట్ అవుతూ రావడమే కాకుండా పలుమార్లు విడుదల వాయిదా వేసుకుంది. బోలెడన్ని మంచి డేట్స్ ని పోగట్టుకుని ఎట్టకేలకి సెప్టెంబర్ 7న సోలోగా తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు నుండి శెట్టికి ఎలాంటి పోటీ లేదు.
ఇదే నవీన్ పోలిశెట్టికి ప్లస్ అవుతాది అనుకున్నారు. ప్రమోషన్స్ తో సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ చేసాడు. గురువారం సినిమా విడుదలైంది. సినిమాకి మంచి టాక్ వచ్చింది, అలాగే క్రిటిక్స్ కూడా పాజిటివ్ రివ్యూస్ ఇవ్వడంతో ఈ కుర్ర హీరో హ్యాపీ. అయితే నవీన్ పోలిశెట్టి ఉండి, ఉండి బాలీవుడ్ బాద్షా షారుఖ్ కి అడ్డంగా దొరికేసాడు. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి విడుదలైన రోజే షారుఖ్ జవాన్ తెలుగులోను భారీగా విడుదలైంది. సరే తెలుగులో ప్రమోషన్స్ లేవు.. జవాన్ కి ఎవరు వెళతారులే అనుకున్నారు.
కానీ నార్త్ నుండి సౌత్ వరకు జవాన్ ప్రభంజనం కనిపించింది. జవాన్ కి నార్త్ నుండి సూపర్ బ్లాక్ బస్టర్ రివ్యూస్ రాగా.. సౌత్ నుండి హిట్ రివ్యూస్ వచ్చాయి. ఎక్కడ చూసినా జవాన్ మాటలే. సోషల్ మీడియాలో మొత్తం జవాన్ ఆక్యుపై చేసింది. హిందీలోనే కాదు.. తెలుగు, తమిళ, మలయాళ ఇలా జవాన్ విడుదలైన అన్ని భాషల్లోను ఓపెనింగ్స్ అదిరిపోతున్నాయి. మాస్ ఆడియన్స్ జవాన్ కి పరుగులు పెడుతున్నారు. మిస్ శెట్టి-మిస్టర్ శెట్టి మల్టిప్లెక్స్ మూవీ, అందులోను ఎన్నో రిలీజ్ డేట్స్ తర్వాత నవీన్ పోలిశెట్టి తన సినిమాని సెప్టెంబర్ 7 న జవాన్ తో పాటుగా విడుదల చేసి బాగా ఇరుక్కుపోయాడు. సోలోగా దిగాడు.. హిట్ టాక్ వచ్చింది.. కానీ షారుఖ్ చేతిలో పడి గిలగిలలాడుతున్నాడు.