బిగ్ బాస్ లో ఏదో విధంగా హైలెట్ అయ్యి అందరి అటెన్షన్ తమ వైపు తిప్పుకోవాలని చూసే కంటెస్టెంట్స్ ప్రతి సీజన్ లోను కనిపిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 మొదలైన రెండు మూడు రోజులకే కంటెస్టెంట్స్ ఎవరి డ్రామా వారు మొదలు పెట్టేసారు. సీరియల్ ఆర్టిస్ట్ శోభా శెట్టి అయితే నామినేషన్స్ ని తీసుకోలేకపోతున్నాను అంటూ కళ్ళ నీళ్లు పెట్టేసుకుంది. గతంలో శివ బాలాజీ బిగ్ బాస్ పై హాట్ వాటర్ కోసం అరిచినట్లుగా.. ఇప్పుడు కాఫీ కోసం బిగ్ బాస్ పై ఫైర్ అయ్యాడు యాక్టర్ శివాజీ .
బిగ్ బాస్ లోకి వెళ్లిన ప్రతి ఒక్కరూ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. కానీ కొంతమంది బిగ్ బాస్ నే క్వచ్చన్ చేస్తూ ఓవరేక్షన్ చేస్తూ హైలెట్ అవుదామని అనుకుంటారు. ఈరోజు ఎపిసోడ్ లో శివాజీ బిగ్ బాస్ కాఫీ పౌడర్ పంపించలేదు, కాఫీ తాగకపోతే తనకి అసలు బాగోదు అంటూ బిగ్ బాస్ అంటూ కేకలు వేసేశాడు. అంతేకాకుండా చేతిలో ఉన్నవస్తువుని నేలకేసి కొట్టాడు, అంతేపొగరుతో దారిలో ఉన్న బకెట్ ని తన్నేసాడు.
బిగ్ బాస్ బిపి మిషన్ ని గౌతమ్ కి ఇచ్చి శివాజీ కి బిపి చూడమన్నాడు. కానీ శివాజీ మాత్రం ఏంటి బీపీ చూస్తావా అంటూ గౌతమ్ పై కూడా అరిచాడు. అలాగే శివాజీని బిగ్ బాస్ కూల్ చేసేందుకు ట్రై చేసాడు. కానీ నీకే బీపీ ఎక్కువైంది అంటూ శివాజీ బిగ్ బాస్ నే తిట్టాడు. రతిక స్టెతస్కోప్ పట్టుకుంటే అది కూడా చేయనివ్వకుండా శివాజీ అడ్డుపడ్డాడు. అందరి హార్ట్ బీట్ చూసి ఈ శివాజీని పిచ్చోడిని చెయ్యాలనుకుంటున్నాడా.. నాకు ఈ బిగ్ బాస్ హౌస్ వద్దే వద్దు అంటూ శివాజీ బిగ్ బాస్ పై ఫైర్ అయిన ప్రోమో వైరల్ గా మారింది.