నందమూరి బాలకృష్ణ, నందమూరి మోక్షజ్ఞ పుట్టిన రోజులు వస్తున్నాయ్.. కానీ నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై ఉత్సుకత వీడడం లేదు. అదిగో, ఇదిగో స్క్రిప్ట్ రెడీ అవుతుంది, బాలకృష్ణే స్వయంగా మోక్షజ్ఞని తన దర్శకత్వంలో హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తారు, ఉహు కాదు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది అంటూ ఏవేవో ఊహగానాలు వినిపించినా అది ఇప్పటివరకు జరగనే లేదు.
నిన్న సెప్టెంబర్ 6 మోక్షజ్ఞ బర్త్ డే. ప్రముఖ నిర్మాణ సంస్థలు, టాప్ డైరెక్టర్స్ నందమూరి అభిమానులు ఇలా అంతా మోక్షజ్ఞకి విషెస్ తెలిపారు. అభిమానులు మాత్రం మోక్షజ్ఞ హీరోగా ఇంట్రడ్యూస్ అవ్వబొయె సినిమా గురించి అప్ డేట్ వస్తుందేమో అని తెగ వెయిట్ చేసారు. మోక్షజ్ఞ బర్త్ డే వచ్చింది, వెళ్ళింది.. ఆ కొత్త సినిమా ముచ్చట మాత్రం వినిపించనే లేదు.
దాంతో నందమూరి అభిమానులు చాలా డిస్పాయింట్ అయ్యారు. బాలయ్య బర్త్ డే కి ఏమైనా గుడ్ న్యూస్ విందామనుకుంటే.. అప్పుడూ లేదు. కనీసం హీరోగా లుక్ మార్చాక వచ్చిన మోక్షజ్ఞ బర్త్ డే కి అయినా ఆ గుడ్ న్యూస్ విందామనుకుంటే మళ్ళీ బాలయ్య.. నందమూరి అభిమానులని నిరాశపరిచారు.