Advertisementt

పోస్ట్ పోన్ పై క్లారిటీ లేదు.. కానీ..

Wed 06th Sep 2023 06:15 PM
salaar  పోస్ట్ పోన్ పై క్లారిటీ లేదు.. కానీ..
There is no clarity on post phone.. but.. పోస్ట్ పోన్ పై క్లారిటీ లేదు.. కానీ..
Advertisement
Ads by CJ

ఇప్పటివరకు ప్రభాస్ సలార్ పోస్ట్ పోన్ పై మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. మూడు రోజుల క్రితం సలార్ పోస్ట్ పోన్ అంటూ వచ్చిన వార్తలు తప్ప.. దానిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. సలార్ పోస్ట్ పోన్ అనగానే పలువురు నిర్మాతలు తమ సినిమాలని సలార్ డేట్ కి రిలీజ్ చెయ్యడానికి రెడీ అయ్యారు. సెప్టెంబర్ 28 న సలార్ రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ సీజి వర్క్ లేట్ అవడంతో ఇప్పుడా డేట్ మారుతుంది అనే న్యూస్ స్ప్రెడ్ అయ్యింది. 

సలార్ పోస్ట్ పోన్న్ అనగానే పలు సినిమాలు ఆఖరికి రామ్ కూడా స్కందని పోస్ట్ పోన్ చేసుకుంటూ సెప్టెంబర్ 15 నుండి 28 కి షిఫ్ట్ చేసాడు. ఈరోజే రామ్ తన సినిమాని సలార్ డేట్ కి లాక్ చేసినట్లుగా ప్రకటించాడు. ఇక కిరణ్ అబ్బవరం కూడా తన సినిమా రూల్స్ రంజన్ ని సెప్టెంబర్ 28 న విడుదల చేస్తున్నట్టుగా అఫీషియల్ అనౌన్సమెంట్ ఇచ్చాడు. శ్రీకాంత్ అడ్డాల పెద్దకాపు కూడా సెప్టెంబర్ 29 న విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. అలాగే MAD మూవీ కూడా సెప్టెంబర్ 28 నే అంటే సలార్ డేట్ నే లాక్ చేసారు. అంతేకాకుండా టైగర్ నాగేశ్వరరావు కూడా అదే డేట్ పై కన్నేసినట్లుగా టాక్. 

కేవలం తెలుగులోనే కాదు.. ఇతర భాషల్లోనూ సలార్ విడుదల వాయిదా అని తెలియగానే తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాలు సలార్ కోసం వెనక్కి తగ్గి, ముందుకొచ్చిన సినిమాలన్నీ ఇప్పడు అది పోస్ట్ పోన్ అవడంతో ఆ సెప్టెంబర్ 28 నే లాక్ చేసి నెమ్మదిగా డేట్స్ ప్రకటిస్తున్నాయి. ఇంత హడావిడి, ఇంత హంగామా చేస్తుంటే.. సలార్ మేకర్స్ మాత్రం ఆ పోస్ట్ పోన్ న్యూస్ ని అధికారికంగా ప్రకటించడం లేదు.

There is no clarity on post phone.. but..:

Is Salaar postponed? Film hit with delay rumours

Tags:   SALAAR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ