Advertisementt

బరువు సమస్య కాదంటున్న అనుష్క

Wed 06th Sep 2023 05:44 PM
anushka shetty  బరువు సమస్య కాదంటున్న అనుష్క
Anushka says weight is not a problem బరువు సమస్య కాదంటున్న అనుష్క
Advertisement
Ads by CJ

అనుష్క సైజు జీరో తర్వాత పెరిగిన బరుతో ఆమె చాలా తక్కువ సినిమాలు చేసింది. ఇప్పటికి పబ్లిక్ లోకి రావడానికి అనుష్క ఆ బరువు కారణంగానే ఇష్టపడడం లేదు అనే ప్రచారం ఉంది. ప్రచారం అని కాదు నిజంగానే అనుష్క బరువు వలనే బయట కనిపించడం లేదు అని చాలామంది ఫిక్స్ అయ్యారు. అటు బరువు, ఆ బరువు వదిలించుకోవడానికి ఆమె చేసిన ప్రయత్నాల వలన అనుష్క అనారోగ్యం బారిన పడింది అందుకే సినిమాలకి దూరమయ్యింది అంటూ గత కొన్నాళ్లుగా కొన్నిరకాల న్యూస్ లు సోషల్ మీడియాలో కనిపించాయి. 

కానీ అనుష్క మాత్రం బరువు ఓ సమస్యే కాదు.. సైజు జీరో వలన తాను సినిమాలకి దూరమవ్వలేదు అంటుంది. సైజ్ జీరో సినిమా వచ్చింది 2015లో. ఆ తర్వాత నేను ఓం నమో వేంకటేశాయ, బాహుబలి-2, భాగమతి, నిశ్శబ్దం.. ఇలా వరుసగా సినిమాలు చేశాను. భాగమతి తర్వాత బ్రేక్ తీసుకోవాలనుకున్నా. అది నా పర్సనల్ డెసిషన్. అయితే నేను విరామం తీసుకోవడానికి సైజ్ జీరో ఎంతమాత్రం కారణం కాదు. నాకు నచ్చి నేను సైజు జీరో లో ఆ పాత్ర చేశాను. 

సైజ్ జీరో కంటే ముందు నేను చేసిన సినిమాల వల్ల చాలా గాయాలయ్యాయి. వరుసగా భారీ సినిమాలు చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా అలసిపోయా. అందుకే విశ్రాంతి అవసరం అనిపించింది. అంతే తప్ప.. సైజ్ జీరో కానీ లేదంటే మారేదన్న సినిమానో నా విరామానికి కారణం కాదు.. అంటూ అనుష్క ఓ ఇంటర్వ్యూలు చెప్పుకొచ్చింది. 

Anushka says weight is not a problem:

Anushka Shetty responds about weight loss issues and marriage

Tags:   ANUSHKA SHETTY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ