Advertisementt

నటి రమ్య స్పందన మరణంపై క్లారిటీ

Wed 06th Sep 2023 03:31 PM
ramya  నటి రమ్య స్పందన మరణంపై క్లారిటీ
Clarity on actress Ramya death నటి రమ్య స్పందన మరణంపై క్లారిటీ
Advertisement
Ads by CJ

కన్నడ నటి, మాజీ ఎంపీ రమ్య గుండెపోటుతో అకాల మరణం చెందింది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యింది. దానితో ఆమె అభిమానులు, కన్నడ ప్రేక్షకులు ఒక్కసారిగా దిగ్బ్రాంతికి లోనయ్యారు. రమ్య మరణ వార్త సంచలనం రేపడం కర్ణాటక ప్రజలను షాక్ గురి చేసింది. పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (PRO) ఆమె మరణం గురించిన వార్తను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో చాలామంది రమ్య మరణానికి షాక్ కి గురవుతూనే.. తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. 

నటి రమ్య మరణ వార్త దవాలనంగా సోషల్ మీడియాని కమ్మేసింది. అయితే రమ్య మరణ వార్త ఫేక్ అంటూ స్నేహితులు, ఆమె కుటుంబ సభ్యులు కొట్టిపడేయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె రాబోయే చిత్రం ఉత్తరాఖండ షూటింగ్‌లో ఉంది. అసలు రమ్య స్పందన చనిపోయింది అనే న్యూస్ ఇంతిలా స్ప్రెడ్ అవడానికి కారణం.. రీసెంట్ గా కన్నడ హీరో విజయ్ రాఘవేంద్ర సతీమణి స్పందన గుండెపోటుతో మరణించడం చూసి.. పొరపాటున రమ్య స్పందన చనిపోయింది అని ట్వీట్ పెట్టారు. 

దానితో రమ్య అభిమానులు, కన్నడ ప్రేక్షకులు అవాక్కవగా.. రమ్య ఫ్యామిలీ మెంబెర్స్, ఆమె ఫ్రెండ్స్ మాత్రం ఈ వార్తని జస్ట్ రూమర్ గా తేల్చేసారు. రమ్య కొత్త ప్రాజెక్ట్ ప్రొడక్షన్ మేనేజర్ సునయన రమ్య మరణ వార్తను కొట్టి పారేస్తూ ఆమె ఆరోగ్యంగా షూటింగ్ లో పాల్గొంటున్నట్టుగా తెలిపింది. రమ్య కూడా తన మరణవార్తను తెలుసుకొని ఈ ఫేక్ న్యూస్ పై తన టీమ్‌తో మాట్లాడి తగిన విధంగా క్లారిటీ ఇవ్వాలని, ఆమె స్వయంగా ట్వీట్ చేయడం గానీ, లేదా వీడియో రిలీజ్ చేసే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. 

Clarity on actress Ramya death:

Production Manager Sunaina clarity on Heroine Ramya death rumour

Tags:   RAMYA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ