రేపు సెప్టెంబర్ 7 న వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ ముందుకు రాబోతున్న షారుఖ్ జవాన్ పై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. పఠాన్ సక్సెస్ తర్వాత షారుఖ్ నుండి వస్తున్న సినిమా కావడము, జవాన్ లో నటించిన స్టార్ క్యాస్ట్, ట్రైలర్ పెంచిన ఎక్స్పెటేషన్స్ అన్ని అందరి చూపు జవాన్ పై పడేలా చేసింది. తెలుగులోనే కాదు, ప్యాన్ ఇండియా మూవీగా విడుదలవుతున్న అన్ని భాషల్లోనూ జవాన్ అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డ్ స్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రం మొదటి రోజు ఓపెనింగ్స్ తో రికార్డ్ సృష్టించడం గ్యారెంటీ అనిపిస్తుంది.
అంతలాంటి అంచనాలున్న జవాన్ పై ఇప్పుడు నెగిటివిటి ప్రారంభమైంది. సోషల్ మీడియా వేదికగా #BoycottJawanMovie హ్యాష్ ట్యాగ్ దర్శనమిచ్చింది. కారణం తమిళనాట జవాన్ ని బ్యాన్ చెయ్యాలంటూ ఆందోళనలు మొదలయ్యాయి. తమిళనాట జావన్ హక్కులని ఉదయానిధి స్టాలిన్ కొన్నారు. ఉదయనిధి జవాన్ హక్కులని కొనుక్కుని విడుదల చేస్తే తమిళులకు ఏం ప్రోబ్లెం అనుకుంటున్నారా.. రెండు రోజుల క్రితం ఉదయనిధి స్టాలిన్ sc, st లకి స్పెషల్ రైట్స్ పై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే.
ఉదయనిధి స్టాలిన్ పై ఓ వర్గం ఆడియన్స్ గుర్రుగా ఉన్నారు. ఉదయనిధి సినిమాలనే కాదు.. ఆయన విడుదల చేసే సినిమాలని కూడా ఆడనివ్వమంటూ వారు నిరసనలు మొదలు పెట్టిన నేపథ్యంలో రేపు విడుదల కాబోయే జవాన్ ని ఇలా సోషల్ మీడియా వ్యాప్తంగా #BoycottJawanMovie హ్యాష్ టాగ్ తో తమ వ్యతిరేఖతని తెలియజేస్తున్నారు.