Advertisementt

పెళ్లిపై అనుష్క కామెంట్స్ వైరల్

Wed 06th Sep 2023 10:54 AM
anushka  పెళ్లిపై అనుష్క కామెంట్స్ వైరల్
Anushka comments on marriage పెళ్లిపై అనుష్క కామెంట్స్ వైరల్
Advertisement
Ads by CJ

అనుష్క ఎప్పుడెప్పుడు పబ్లిక్ లోకి వస్తుందా అని ఆమె అభిమానులు ఎదురు చూడని రోజు లేదు. మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి సినిమాతో రేపు గురువారమే ఆడియన్స్ ముందుకు రాబోతున్న అనుష్క.. ప్రమోషన్స్ లో మాత్రం ఎక్కడా కనిపించడం లేదు కానీ.. వినిపిస్తోంది. అంటే ఫోన్ ఇంటర్వూస్ లో అనుష్క కొంతమందికి ఇంటర్వూస్ ఇస్తుంది. నవీన్ పోలిశెట్టి తో కలిసి నటించిన అనుష్క ఆ సినిమా పబ్లిక్ ప్రమోషన్స్ కి దూరంగా ఉన్నప్పటికీ ఫోన్ ఇంటర్వూస్ తో సినిమపై హైప్ క్రియేట్ చేస్తుంది. 

మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి సినిమాతో పాటుగా పర్సనల్ విషయాలని కూడా రివీల్ చేస్తుంది. అందులో ముఖ్యంగా ప్రభాస్ తో ఫ్రెండ్ షిప్, అలాగే ఆమె పెళ్లిపై అనుష్క చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. కళ్యాణమొచ్చినా అదేదో వచ్చినా ఆగదంటారు కదా అలానే పెళ్లి సమయం వస్తే ఏది ఆగదు.. పెళ్లి అనేది మంచి విషయం కాబట్టి.. నాకూ చేసుకోవాలనే ఉంది. ఆ సమయం వచ్ఛినప్పుడు జరిగిపోతుంది. పెళ్లి కుదిరితే హ్యాపీగా మీ అందరితో షేర్ చేసుకుంటాను అని చెప్పింది. 

ఇక ప్రభాస్-ప్రమోద్ ఫ్రెండ్ షిప్ చేసి ఫుడీగా మారిపోయారా అంటే.. లేదు వారు తినే ఫుడ్ చూస్తే ఎవ్వరైనా డైట్ చెయ్యాల్సిందే.. ప్రభాస్ 2005 నుండే నాకు తెలుసు. అప్పుడెలా ఉన్నాడో ప్రభాస్ ఇప్పుడు అలానే ఉన్నాడు. ఇంత గుర్తింపు వచ్చినా ఏమి మారలేదు. ప్రభాస్ నాకు ఎప్పటికి వెరీ వెరీ డియర్ ఫ్రెండ్ అంటూ అనుష్క పెళ్లిపై, ప్రభాస్ ఫ్రెండ్ షిప్ పై కామెంట్స్ చేసింది. 

Anushka comments on marriage :

Anushka on marriage and Prabhas friendship

Tags:   ANUSHKA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ