నిన్న సాయంత్రం సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ కి ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ కౌంటర్ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. ఖుషి సక్సెస్ మీట్ లో విజయ్ దేవరకొండ తన రెమ్యునరేషన్ నుండి అభిమానులకి కోటి విరాళం ప్రకటించాడు. దానితో విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాని కొని పంపిణి చేసి నష్టపోయిన అభిషేక్ పిక్చర్స్ వారు విజయ్ దేవరకొండని ట్యాగ్ చేస్తూ... మేము మీ సినిమా కొని 8 కోట్లు నష్టపోయాము. మాకు ఇలా సహాయం చేయొచ్చుగా అంటూ వెటకారంగా ట్వీట్ వేశారు.
అయితే కొంతమంది విజయ్ దేవరకొండ అతికి పర్ఫెక్ట్ కౌంటర్ అంటుంటే.. మరికొంతమంది మాత్రం విజయ్ దేవరకొండకి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. సినిమా నష్టాలతో హీరోకి సంబంధం ఏముంటుంది.. సినిమా కొని నష్టపోతే నిర్మాతలని అడగాలి కానీ.. హీరోని అడగడమేమిటి.. ఒకవేళ సినిమా హిట్ అయితే ఆ లాభాలు హీరోకి ఇస్తారా.. ఇవ్వరు కదా.. ఇప్పుడు నష్టపోతే హీరోని బ్లేమ్ చెయ్యాల్సిన అవసరం ఏముంది.
అదే గనక పెద్ద హీరో సినిమా కొని నష్టపోతే ఇలా సోషల్ మీడియాలో ట్వీట్ వేసే దమ్ము ఏ నిర్మాణ సంస్థకైనా ఉందా అంటూ రౌడీ ఫాన్స్ మాత్రమే కాదు.. చాలామంది నెటిజెన్స్ విజయ్ దేవరకొండని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు.