ఏపీ సీఎం జగన్ యూకే పర్యటన వెనుక కూతురు ఉందనుకున్నాం.. కానీ గండికోట రహస్యమే దాగుందట. తన కుమార్తెను చూసేందుకని సీబీఐ అనుమతి తీసుకుని మరీ ఎన్నికల సమయంలో యూకేకు వెళితే.. కూతురిపై ఇంత ప్రేమా అనుకున్నారు కానీ ఆ ప్రేమంతా కేమ్యాన్ ఐలాండ్స్ బ్యాంక్‌పై అనుకోలేదు. ఇప్పుడు జగన్ యూకే పర్యటన ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. సామాన్య ప్రజానీకానికి కేమ్యాన్ ఐలాండ్స్ గురించి దాదాపు తెలియదనే చెప్పాలి. కానీ జగన్ పర్యటన పుణ్యమాని ఇది ప్రతి ఒక్కరికీ తెలిసింది. ఇంతకీ జగన్ పర్యటనకు ఈ బ్యాంకుకు సంబంధం ఏంటి?
ప్రత్యేక స్వయం ప్రతిపత్తి దేశంగా కేమ్యాన్ ఐలాండ్స్ ఉంది. ఇది ప్రపంచానికే ఫైనాన్షియల్ సెంటర్. పశ్చిమ కరేబియన్ సముద్రంలో ట్యాక్స్ ఫ్రీ దేశం కాబట్టి ఇక్కడ మన డబ్బును నిల్వ చేసుకుంటే ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరమైతే ఉండదు. అంతేకాదు.. ఎంత డబ్బు అయినా ఈ బ్యాంకులో దాచుకోవచ్చు. ఇదంతా ఓకే కానీ జగన్‌కు దీనికి ఏంటి సంబంధం అంటారా? కేవలం తన అక్రమ సంపాదనను కేమ్యాన్ ఐలాండ్స్ బ్యాంక్‌లో గతంలో జగన్ డబ్బు దాచుకున్నారట. ఇప్పుడు ఎన్నికల సమయం సమీపిస్తోంది కాబట్టి ఆ డబ్బును తెచ్చుకునేందుకే జగన్ యూకే వెళ్లారని ప్రచారం జరుగుతోంది.
జగన్ ఇంత కీలక సమయంలో ఈ నెల 12 వరకూ యూకేలోనే ఉండబోతున్నారు. ఇది కూడా పై ప్రచారానికి కారణమైంది. ఇంత కీలక సమయంలో ఇన్ని రోజుల పాటు యూకేలో ఉండిపోవడం వెనుక మర్మం దాచుకున్న డబ్బును తెచ్చుకునేందుకేనని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ కూతురి కోసమే అయితే ఇలాంటి కీలక సమయంలో వెళ్లరని.. అవసరమైతే ఆమెనే ఏపీకి రప్పించుకుంటారని అంటున్నారు. మొత్తానికి యూకే పర్యటన వెనుక పెద్ద కారణమే ఉందని చెప్పుకుంటున్నారు. మరోవైపు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసుకుని మరీ వెళ్లడం వెనుక మతలబు కూడా తన డబ్బును తెచ్చుకునేందుకేనని ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా లోగుట్టు జగన్ అండ్ కోకు మాత్రమే ఎరుక.