ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో నాగబాబు కుటుంభం ఆఫ్రికాలో ఎంజాయ్ చేస్తుంది, నాగబాబు ఆయన భార్య పద్మ, వరుణ్ తేజ్, నిహారిక ఇలా ఫ్యామిలీ మొత్తం రిలాక్స్ అవుతూ ఆఫ్రికాలో ఎంజాయ్ చేస్తున్న పిక్స్ ని నాగబాబు షేర్ చేసారు. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నట్టుగా ఆయన పోస్ట్ పెట్టారు. వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకోబోతున్నాడు. వరుణ్ తేజ్ - లావణ్య ల వివాహం డెస్టినేషన్ వెడ్డింగ్ గా ఉండబోతుంది. ఈ విషయం వరుణ్ తేజ్ ఎప్పుడో కన్ఫర్మ్ చేసాడు.
అయితే అది ఇటలీలో ఉంటుంది అనే టాక్ ఉంది. ఇప్పుడు ప్రత్యేకంగా నాగబాబు ఫ్యామిలీ వరుణ్ తేజ్ వివాహానికి కావల్సిన లొకేషన్ చూడడానికే ఈ ఆఫ్రికా ట్రిప్ వేసుకున్నారని అంటున్నారు. నాలుగురు ఒకే చోట ఉండి.. ఫ్యామిలీ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తుంది నాగబాబు కుటుంభం. అటు నిహారిక కూడా విడాకులు తీసుకుని తండ్రి ఫ్యామిలీతో కలిసి ఉంటుంది.
వరుణ్ తేజ్ వివాహానికి ముందుగా నాగబాబు కాస్తంత రిలాక్సేషన్ కోసమే ఆఫ్రికా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అటు వరుణ్ తేజ్ కూడా గాండీవధార అర్జున మూవీ తో డిస్పాయింట్ మోడ్ లో ఉన్నాడు. పెళ్లి పనుల కోసము, కొడుకు, కూతురు కోసం నాగబాబు ఇలా వెకేషన్ ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది.