Advertisementt

ఖుషిపై నెగిటివిటి: విజయ్ సెన్సేషనల్ కామెంట్స్

Tue 05th Sep 2023 11:14 AM
kushi  ఖుషిపై నెగిటివిటి: విజయ్ సెన్సేషనల్ కామెంట్స్
Negativity on Kushi: Vijay sensational comments ఖుషిపై నెగిటివిటి: విజయ్ సెన్సేషనల్ కామెంట్స్
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండ రీసెంట్ మూవీ ఖుషి గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్, సాంగ్స్ అన్ని సినిమాపై అంచనాలు పెంచగా.. ప్రమోషన్స్ విషయంలో ప్రేక్షకులు డిస్పాయింట్ అయినా.. ఫైనల్ గా ఖుషి మూవీకి పబ్లిక్ నుండి హిట్ టాక్ వచ్చేసింది. అయితే సినిమా విడుదలైన రోజు విజయ్ దేవరకొండని తిడుతూ, ఖుషి సినిమా బాలేదు అంటూ పలు యూట్యూబ్ ఛానల్స్ లో ఖుషిపై నెగెటివ్ టాక్ ని స్ప్రెడ్ చేసారు. క్రిటిక్స్ నుండి పాజిటివ్ రివ్యూస్ వచ్చినా.. చాలా యూట్యూబ్ ఛానల్స్ లో విజయ్ దేవరకొండపై నెగిటివిటి కనిపించింది. 

అప్పుడే అనుకున్నారు విజయ్ పై ఇంత కక్ష గట్టారేమిటి అని. అదే విషయాన్ని విజయ్ దేవరకొండ గత రాత్రి వైజాగ్ లో జరిగిన ఖుషి మూవీ సక్సెస్ మీట్ లో మాట్లాడాడు. తనపై కొంతమంది కావాలని నెగిటివిని ప్రచారం చేస్తున్నారు. ఖుషి మూవీపై విష ప్రచారం చేసారు. సినిమా బాలేదు అంటూ పలు యూట్యూబ్ ఛానల్స్ లో నెగెటివ్ గా రివ్యూస్ ఇచ్చారు. కొంతమంది డబ్బులిచ్చి మరీ నాపై నా సినిమాపై ఫేక్ రివ్యూస్ ఇప్పించారు. 

కానీ ఖుషి సినిమా సక్సెస్ అయ్యింది. హిట్ అయ్యింది. అందుకు నా అభిమానులు కారణం. వారి ప్రేమే, వారి ఆదరణే కారణం.. అంటూ విజయ్ దేవరకొండ తన సినిమాపై వచ్చిన ఫేక్ రివ్యూస్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు. మరి నిజంగానే విజయ్ సినిమాపై విష ప్రచారం జరిగింది. దానికి కారణమెవరో అంటూ ఇప్పుడు నెటిజెన్స్ తెగ ఆలోచిస్తున్నారు. 

Negativity on Kushi: Vijay sensational comments:

Vijay Deverakonda sensational comments

Tags:   KUSHI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ