Advertisementt

హరీష్ శంకర్.. మనల్ని ఎవడ్రా ఆపేది?

Sat 09th Sep 2023 09:35 AM
ustaad bhagat singh,pawan kalyan,harish shankar,mythri movie makers  హరీష్ శంకర్.. మనల్ని ఎవడ్రా ఆపేది?
Ustaad Bhagat Singh Latest Update Creates Sensation హరీష్ శంకర్.. మనల్ని ఎవడ్రా ఆపేది?
Advertisement
Ads by CJ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఓ పవర్ ఫుల్ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ 5 నుంచి మళ్లీ మొదలవ్వబోతున్నట్లుగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు తెలియజేశారు. ఈ షెడ్యూల్‌లో ఓ పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్‌ని చిత్రీకరించబోతున్నట్లుగా తెలుపుతూ.. షేర్ చేసిన పిక్ చూస్తే అంతా భయపడిపోవాల్సిందే. 

ఎందుకంటే.. ఈ పిక్‌లో రకరకాల కత్తులతో దర్శకుడు హరీష్ శంకర్ దర్శనమిచ్చారు. హరీష్ శంకర్ నిలబడి ఉండగా.. ఆయన ఎదురుగా ఇన్ని రకాల కత్తులు ఉంటాయా? అనేలా అన్ని రకాల కత్తులను ఒక చోట చేర్చి ఉంచారు. ఈ పిక్ చూస్తుంటే.. ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణను హరీష్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక మైత్రీ వారు చేసిన ఈ పోస్ట్‌కు రీ ట్వీట్ చేసి.. మనల్ని ఎవడ్రా ఆపేది? అంటూ హరీష్ శంకర్ కూడా.. సెప్టెంబర్ 5న ఎటువంటి ఎపిసోడ్ చిత్రీకరణ జరగబోతుందనేది క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. 

ఈ పోస్ట్‌కి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ.. ఊచకోత మొదలవ్వబోతుంది.. హరీష్ అన్న ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడ్రోయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన టాలీవుడ్ క్రష్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.

Ustaad Bhagat Singh Latest Update Creates Sensation:

Mythri Movie Makers Update on Ustaad Bhagat Singh

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ