Advertisementt

అసిస్టెంట్ పెళ్లిలో నేషనల్ క్రష్ షాక్!

Fri 08th Sep 2023 10:59 PM
rashmika mandanna,assistant,shock,rashmika  అసిస్టెంట్ పెళ్లిలో నేషనల్ క్రష్ షాక్!
Rashmika Mandanna Shocks at His Assistant Marriage అసిస్టెంట్ పెళ్లిలో నేషనల్ క్రష్ షాక్!
Advertisement
Ads by CJ

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. తన అసిస్టెంట్ సాయి పెళ్లిలో షాకయింది. రీసెంట్‌గా హైదరాబాద్‌ బహుదూర్ పల్లి‌లో జరిగిన తన అసిస్టెంట్ సాయి పెళ్లికి రష్మిక మందన్నా హాజరయ్యారు. అతిథులంతా వెళ్లిపోయిన తర్వాత ఆమె కళ్యాణ మండపానికి చేరుకుని నూతన జంటను ఆశీర్వదించారు. అయితే అదే సమయంలో ఆ నూతన జంట తన కాళ్లపై పడటంతో.. రష్మిక ఒక్కసారిగా షాకయింది. వెంటనే తేరుకుని.. దైవాన్ని ప్రార్థిస్తూ.. ఇద్దరూ నిండునూరేళ్లు పిల్లపాపలతో హాయిగా ఉండాలని ఆశీర్వదించింది.

తనని అంత గౌరవంగా చూడటంతో పాటు.. ఊహించని విధంగా తన కాళ్లకి నమస్కారం చేయడంతో రష్మిక మందన్నకు ఏం చేయాలో తెలియలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం రష్మిక సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలు, పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ నేషనల్ క్రష్ ఇమేజ్‌తో దూసుకెళుతోంది.

ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాలన్నీ భారీ సినిమాలే కావడం విశేషం. రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ వంగా దర్శకత్వంలో రూపొందుతోన్న యానిమల్ చిత్రంలో రష్మిక నటిస్తోంది. జాతీయ ఉత్తమ నటుడిగా గుర్తింపు పొందిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2లో శ్రీవల్లి పాత్రను రష్మిక చేస్తోంది. వెర్సటైల్ స్టార్ ధనుష్, శేఖర్ కమ్ముల మూవీలోనూ రష్మిక నటిస్తున్నారు. వీటితో పాటు రష్మిక ప్రధాన పాత్రలో రెయిన్ బో అనే సినిమా ఒకటి తెరకెక్కుతోంది.

Rashmika Mandanna Shocks at His Assistant Marriage :

Rashmika Mandanna Graces The Wedding Of Her Assistant  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ