బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఆదివారం సాయంత్రం గ్రాండ్‌గా అంటే గ్రాండ్‌గా కాదులేగానీ.. చాలా నార్మల్‌గా ప్రారంభించారు. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి అడుగుపెట్టారు కానీ.. ఇంకా వారు హౌస్‌మేట్స్ కాదని నాగార్జున చెప్పారు. పవరాస్త్ర అంటూ ఈసారి కంటెస్టెంట్స్ వేరు, హౌస్‌మేట్స్ వేరు అంటూ పెద్ద ట్విస్టే ఇచ్చిన నాగార్జున.. ఈ 14 మందిలో ఫైనల్ హౌస్‌మేట్స్ ఎవరనేది మాత్రం ఇంకా తేల్చలేదు. అలాగే.. ఇంత వరకు మీరు చూసిన ఆట వేరు. ఇక చూడబోయేది వేరు.. ఈసారి అంతా ఉల్టా పుల్టాగా ఉంటుందని.. అస్సలు ఊహకు అందదని చెప్పినట్లే.. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముగించారు.
అయితే చెప్పినట్లుగానే ఉల్టా పుల్టాగానే ఈ షో మొదలైంది. హౌస్ లాస్ట్ వీక్ ఫినాలేలో టాప్ 5లో ఉండే వారికి సూట్ కేస్ ఇచ్చి ఆఫర్ ఇచ్చినట్లుగా.. ఈ సీజన్‌లో మొదటి 5గురు కంటెస్టెంట్స్‌కి అలాంటి ఆఫరే ఇచ్చారు నాగార్జున. ఈ ఐదుగురు మేము మనీ కోసం రాలేదని.. హౌస్‌లో ఉండటానికే వచ్చామని చెప్పినా.. ఫైనల్‌గా అందరూ వచ్చేది మనీ కోసం, ట్రోఫీ కోసమే అనేది తెలియని విషయం కాదు. అందునా.. ఇప్పటి వరకు జరిగిన 6 సీజన్లలో గెలిచిన ఏ ఒక్కరూ కూడా.. లైమ్ లైట్‌లో లేరు. బిగ్ బాస్ విన్ అవ్వడం వల్ల వారికి ఒరిగిందేమీ లేదు. మరి అలాంటప్పుడు.. అసలు హౌస్‌లో ఏం చేయకుండానే.. అడుగుపెట్టగానే రూ. 35 లక్షలు వస్తుంటే.. కామ్‌గా తీసుకుని చెక్కేయకుండా.. ఉంటాం అంటూ ఐదుగురూ బీరాలు పోయారు.
నిజంగా ఇది బంపరాఫర్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే.. ఈ ఐదుగురులో చివరి వరకు ఉండేది ఎవరో, మధ్యలోనే ఎలిమినేట్ అయ్యేది ఎవరో? వారికే తెలియదు. మధ్యలో కొన్ని డ్రామాలు కూడా జరగవచ్చు. ఏడుపులు, పెడబొబ్బలు, టాస్క్‌లు.. ఇవేం లేకుండానే రూ. 35 లక్షలు వస్తుంటే హాయిగా తీసుకోకుండా.. పెద్ద మిస్టేకే చేశారని చెప్పుకోవాలి. ఏదీఏమైనా ఈ ఐదుగురు కంటెస్టెంట్స్ బంపరాఫర్ మిస్సయ్యారనేది మాత్రం.. ఈ షో చూస్తున్న వారు, ఈ షో గురించి తెలిసిన వారు మాట్లాడుకుంటుండటం విశేషం.