పాపం పూజా హెగ్డే పరిస్థితి అటు ఇటు కాకుండా పోయింది. ప్రస్తుతం ఈ భామ చేతిలో కొత్త ప్రాజెక్ట్స్ ఏమీ లేవు. దీంతో పూజా హెగ్డేని చులకన చేస్తూ.. కొందరు సోషల్ మీడియాలో అమ్మడి పని అయిపోయిందనేలా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే కూడా కావాలని గ్యాప్ తీసుకున్నట్లుంది. చేతిలో ఉన్న అవకాశాలు కూడా వద్దనుకుని మరీ హాలీడేకి వెళ్లిపోయింది. ఫారెన్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలతో సోషల్ మీడియాని హీటెక్కించే పనిలో ఉంది. ఇప్పటికైనా సరే.. తను తిరిగి వచ్చి రెడీ అంటే చాలు.. క్యూ కట్టడానికి నిర్మాతలు రెడీగానే ఉన్నారు.
అయితే ఎంత క్యూ కట్టినా.. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఎప్పుడూ నిలబెడుతుంటుంది. ఆ సక్సెస్ పడి పూజాకి చాలా రోజులు అవుతుంది. తెలుగు, హిందీ, తమిళ్.. ఇలా ఏ భాషలోనూ ఆమెకు సరైన హిట్ ఈ మధ్య కాలంలో పడలేదు. కెరీర్ మొదట్లో ఎలాగైతే అంతా ఆమెని ఐరన్ లెగ్ అని పిలిచేవారో.. ఇప్పుడామెను అలాగే కొందరు పనికట్టుకుని మరీ ట్రోల్ చేస్తున్నారు. అయినా సరే.. పూజా హెగ్డే పుంజుకుంటుందని ఆమె అభిమానులు భావిస్తున్నారు. అందుకే కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్నట్లుగా వారు చెబుతున్నారు.
వాస్తవానికి మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలోనూ, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోనూ ముందు పూజా హెగ్డేనే అనుకున్నారు. కానీ ఈ రెండు అవకాశాలను టాలీవుడ్ క్రష్ శ్రీలీల సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆమె కాలికి సర్జరీ అయినందువల్లే పూజా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుందనేలా వార్త కూడా మరో వైపు వినిపిస్తున్నా.. అలాంటిదేమీ లేదని.. కొంత గ్యాప్ తర్వాత వస్తే మళ్లీ ఫ్రెష్ ఫీల్ వస్తుందని పూజా భావిస్తున్నట్లుగా ఆమె సన్నిహితులు కొందరు చెబుతున్నారు. ఏదీఏమైనా పూజాని మళ్లీ బిజీ నటిగా చూడాలని ఆమె అభిమానులు మాత్రం బాగా కోరుకుంటున్నారు.