Advertisementt

చంద్రముఖి 2 ట్రైలర్ ఎలా ఉందంటే..

Mon 04th Sep 2023 12:37 PM
chandramukhi 2,trailer,raghava lawrence,kangana ranaut,p vasu  చంద్రముఖి 2 ట్రైలర్ ఎలా ఉందంటే..
Chandramukhi 2 Trailer Released చంద్రముఖి 2 ట్రైలర్ ఎలా ఉందంటే..
Advertisement
Ads by CJ

స్టార్ కొరియోగ్రాఫ‌ర్‌, డైరెక్ట‌ర్‌, యాక్ట‌ర్  రాఘవ లారెన్స్ హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ భారీ బ‌డ్జెట్ మూవీ ‘చంద్రముఖి 2’. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో నటిస్తోంది. సీనియర్ డైరెక్ట‌ర్ పి.వాసు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ‘చంద్రముఖి 2’ సినిమాను సెప్టెంబ‌ర్ 15న విడుద‌ల చేయబోతున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉందంటే.. 

స్టార్టింగే సాగదీతగా రాజా ది రాజా అంటూ మొదలైన ఈ ట్రైలర్ .. వెట్టయ్య రాజా అంటూ లారెన్స్‌ని నార్మల్ లుక్‌లో పరిచయం చేశారు. వడివేలు ఎంట్రీతో ప్యాలెస్‌ను చూపించారు. ఆ ప్యాలెస్‌లో దక్షిణం వైపు వెళ్లవద్దంటూ.. కథలోకి తీసుకెళ్లిన తీరు బాగుంది. ఒక్కొక్క పాత్రని పరిచయం చేస్తూ.. 17 సంవత్సరాల కథకి కనెక్ట్ చేస్తూ.. చంద్రముఖి పాత్రను పరిచయం చేశారు. కంగనా రనౌత్ కళ్లు తిప్పుతూ.. చంద్రముఖిగా కనిపించిన తర్వాత అసలైన చంద్రముఖిని చూడబోతున్నారంటూ.. అప్పటి చంద్రముఖి సీన్లని గుర్తుచేశారు. వాడు వచ్చేశాడు అంటూ వెట్టయ్య రాజుగా లారెన్స్‌ పరిచయం, ఆ తర్వాత వచ్చే యుద్ధ సన్నివేశాలతో పాటు.. రెండు వందల ఏళ్ల నాటి పగ అంటూ.. 17 ఏళ్ల తర్వాత చంద్రముఖి వస్తున్నట్లుగా ఎండింగ్ ఇచ్చిన తీరు బాగుంది. విజువల్స్, మ్యూజిక్ వేటికవే పోటీ అన్నట్లుగా ఉన్నాయి.

కంగనా రనౌత్ పాత్రని పెద్దగా రివీల్ చేయలేదు కానీ.. లారెన్స్ పాత్రలోని రెండు కోణాలను స్పష్టంగా రివీల్ చేశారు. ఇంకా ఇందులో లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్, మంజిమా మోహన్, సృష్టి డాంగే, సుభిక్ష కృష్ణన్, రాధిక, రావు రమేష్ మరియు వడివేలు వంటి వారంతా కీలక పాత్రలు పోషించినట్లుగా ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. ట్రైలర్ వరకు సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసేలానే కట్ చేశారు. ఇక సెప్టెంబర్ 15న వచ్చే ఈ చంద్రముఖి ఎలా భయపెడుతుందో చూడాలి. 

Chandramukhi 2 Trailer Released:

Chandramukhi 2 Trailer Review

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ