Advertisementt

అల్లు అర్జున్ లిస్ట్‌లోకి అట్లీ.. ఫిక్సా!

Mon 04th Sep 2023 11:30 AM
icon star,allu arjun,jawan,atlee,bunny  అల్లు అర్జున్ లిస్ట్‌లోకి అట్లీ.. ఫిక్సా!
Allu Arjun to team with Atlee అల్లు అర్జున్ లిస్ట్‌లోకి అట్లీ.. ఫిక్సా!
Advertisement
Ads by CJ

జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన అనంతరం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మీడియాలో ఎలా సందడి చేస్తున్నారో తెలియంది కాదు. ‘పుష్ప ది రైజ్’ సినిమాలో ‘పుష్పరాజ్’గా అల్లు అర్జున్ అభినయానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడమే కాకుండా.. టాలీవుడ్ తరపు నుంచి ఉత్తమ నటుడిగా మొదటిసారి అవార్డు గెలుచుకోవడంతో ఆయన ఫ్యాన్స్ మాత్రమే కాదు.. టాలీవుడ్ అంతా హ్యాపీగా ఉంది. ప్రస్తుతం ‘పుష్ప’ రెండో పార్ట్‌ షూటింగ్‌లో బన్నీ పాల్గొంటున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన రెండు చిత్రాలకు కమిట్ అయిన విషయం తెలిసిందే. 

తనకు హ్యాట్రిక్ హిట్ చిత్రాలను ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో డబుల్ హ్యాట్రిక్‌కు అల్లు అర్జున్ శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ భారీ లెవల్‌లో ఉండబోతుందనేలా ఇటీవల అధికారిక ప్రకటన వచ్చింది. అలాగే ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ వంగాతో కూడా బన్నీ ఓ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పి ఉన్నారు. ఇప్పుడు మరో డైరెక్టర్‌ను లైన్‌లో పెట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. విజయ్‌తో కమర్షియల్ హిట్స్ అందుకుని.. ఇప్పుడు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్‌ని ‘జవాన్’‌గా చూపించబోతోన్న అట్లీ. అవును అట్లీ చెప్పిన కథ అల్లు అర్జున్‌కు బాగా నచ్చిందని.. కాకపోతే వెయిటింగ్ లిస్ట్‌లో పెట్టాడనేలా వార్తలు వినవస్తున్నాయి.

ప్రస్తుతం అట్లీ చేసిన ‘జవాన్’ కనుక బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధిస్తే మాత్రం.. అట్లీతో ప్రాజెక్ట్ ఓకే అయినట్లే. ఆ సినిమా రిజల్ట్ కోసం అల్లు అర్జున్ వెయిట్ చేస్తున్నాడనేలా.. టాక్ వినిపిస్తోంది. ‘జవాన్’ చిత్రం సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకాబోతోంది. ఈ సినిమా రిజల్ట్ తర్వాత అల్లు అర్జున్- అట్లీ కాంబో సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అల్లు అర్జున్‌కు ఇతర ఇండస్ట్రీ దర్శకులతో చేయాలని ఎప్పటి నుంచి కోరిక ఉంది. ఆ కోరిక ఈ సినిమాతో తీరే అవకాశం ఉందని.. ఆయన ఫ్యాన్స్ కూడా చెప్పుకుంటున్నారు. 

Allu Arjun to team with Atlee:

Icon Star Allu Arjun Monitoring Jawan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ