శాకుంతలం సినిమా కథ, ఆ గ్రాఫిక్స్ ఎంత చీప్ గా ఉన్నాయో.. సమంత లుక్స్, ఆమె పెరఫార్మెన్స్ పై అంతే ట్రోల్స్ వచ్చాయి. ఒకప్పుడు క్యూట్ గా స్వీట్ గా కనిపించిన సమంత శాకుంతలం సినిమాలో చాలా నీరసంగా, అసలు కళ లేకుండా కనిపించింది. ఇప్పుడు ఖుషి మూవీలో కూడా సమంత లుక్స్ విషయంలో ఆమె ఫాన్స్ బాగా డిజప్పాయింట్ అవుతున్నారు. ఆరాధ్య కేరెక్టర్ కి ఆమె సూట్ కాలేదు అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. సాంగ్స్ లో రొమాంటిక్ గా విజయ్ దేవరకొండతో మంచి కెమిస్ట్రీ చూపించింది. కానీ కొన్ని సన్నివేశాల్లో సమంత తేలిపోయింది అంటున్నారు.
విజయ్ దేవరకొండ విప్లవ్ పాత్రలో పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాడు. కానీ సమంతలో గతంలో ఉన్న చార్మ్, ఆ ఎనర్జి మిస్ అయ్యింది. తన లుక్స్, ఇమేజ్ అంతలా మారిపోయాయి. విజయ్ దేవరకొండతో ఆమెకు జోడీ కుదరలేదు. విజయ్ చాలా హ్యాండ్సమ్ గా కనిపించాడు. అలాంటి విజయ్ సమంతను చూసి మైమరిచిపోయి, వెర్రెత్తిపోవడం అంత మెచ్చేలా లేదు అంటున్నారు. సమంత లుక్స్ మాత్రమే కాదు.. పెరఫార్మెన్స్ చూసినా ఆర్టిఫీషియల్ గా అనిపించింది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
విజయ్ దేవరకొండ పక్కన సమంత కాకుండా ఏ యంగ్ హీరోయిన్ నో, లేదంటే ఫ్రెష్ హీరోయిన్ నో పెట్టుకుంటే ఖుషి రిజల్ట్ వేరేలా ఉండేది. ఖుషి ఇంకాస్త హిట్ అయ్యేది. ప్రస్తుతమైతే ఖుషికి మంచి టాక్ సొంతమయ్యింది. ఫ్యామిలీ ఆడియన్స్ ఖుషిని చూసేందుకు ఇంట్రెస్ట్ గా ఉన్నారు. సమంత విషయంలో మిగతా ఆడియన్స్ మాత్రమే కాదు.. ఆమె అభిమానులే డిస్పాయింట్ అవుతున్నారు.