Advertisementt

OG గ్లింప్స్ పై నెటిజెన్స్ రియాక్షన్

Sat 02nd Sep 2023 04:31 PM
og glimpse-hungry cheetah  OG గ్లింప్స్ పై నెటిజెన్స్ రియాక్షన్
Netizens Reaction on OG Glimpses OG గ్లింప్స్ పై నెటిజెన్స్ రియాక్షన్
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ బర్త్ డే కి పవన్ ఫాన్స్ కి ట్రీట్స్ మీద ట్రీట్స్ వచ్చేసాయి. ఆయన నటిస్తున్న సినిమాల నుండి ఫస్ట్ లుక్స్, గ్లింప్స్ , పోస్టర్ అంటూ మేకర్స్ హడావిడి చేస్తుంటే.. ఫాన్స్ వాటిని ట్రెండ్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు. సాహో దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో దానయ్య నిర్మిస్తున్న ప్యాన్ ఇండియా ఫిలిం నుండి అభిమానుల కోసం గ్లిమ్ప్స్ సిద్ధం చేసారు. గత నాలుగు రోజులుగా OG అప్ డేట్స్ తో దానయ్య పవన్ ఫాన్స్ ని సంతోషపెడుతున్నారు. 

ఇక తాజాగా వదిలిన గ్లింప్స్ పక్కా యాక్షన్ గ్యాంగ్ స్టర్ గా పవన్ కళ్యాణ్ OG లుక్స్ ఉన్నాయి. OG గ్లింప్స్ చూసిన అభిమానులకు పూనకాలు వస్తున్నాయి. వింటేజ్ పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ కనిపించింది అంటూ అభిమానులు ఆనంద పడిపోతున్నారు. సుజిత్ మేకింగ్ సూపర్ అంటున్నారు. కానీ థమన్ ఇచ్చిన BGM పై నెటిజెన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా OG గ్లింప్స్ చూస్తే సాహో చూసినట్టుగా ఉంది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇక థమన్ అయితే విక్రమ్-జైలర్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్స్ ని మిక్స్ చేసి OG కి ఇచ్చాడు. విక్రమ్ BGM చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగే థమన్ నేపధ్య సంగీతం OG డైలాగ్స్ ని ఓవర్ టేక్ చేశాయంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ లుక్స్, ఆయన OG స్టయిల్ అన్ని ఫాన్స్ కి బాగా నచ్చేసాయి. కానీ పవన్ కళ్యాణ్ పెరఫార్మెన్స్ పై నెటిజెన్స్ పెదవి విరుస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏదో పట్టి పట్టి చేస్తున్నారనిపించేలా ఉంది అంటూ OG గ్లింప్స్ పై నెటిజెన్స్ రకరాలుగా స్పందిస్తున్నారు. 

Netizens Reaction on OG Glimpses:

OG Glimpse-Hungry Cheetah

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ